YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మార్చి నాటికి సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ యూనిట్ల ఏర్పాటు ప్లాస్టిక్ వస్తువుల నియంత్రణ పంచాయితీలకు బహుమతులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్

మార్చి నాటికి సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ యూనిట్ల ఏర్పాటు  ప్లాస్టిక్ వస్తువుల నియంత్రణ పంచాయితీలకు బహుమతులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్
రాష్ట్రంలో ప్రస్తుతం గ్రామాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో సాలిడ్ వేస్ట్,లిక్విడ్ వేస్ట్ మరియు ప్లాస్టిక్ వేస్టు వంటివి మూడు ప్రధాన సవాళ్లని వాటిని సమర్ధవంతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ పేర్కొన్నారు.మంగళవారం అమరావతి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధిపై ఆశాఖ అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా స్వచ్చ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలపై సిఎస్ సమీక్షిస్తూ వివిధ గ్రామాల్లో ఏర్పాటుచేయ ప్రతిపాదించిన సాలిడ్ వేస్ట్ నిర్వహణ ప్రాజెక్టులను వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు.నేడు గ్రామ పంచాయితీలు ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సమస్యల్లో సాలిడ్,లిక్విడ్ వేస్టులతోపాటు ప్లాస్టిక్ వ్యర్ధాలు ముఖ్యమైన సవాళ్లని వాటిని సమర్ధవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన పునరుద్ఘాటించారు.మండలానికొక ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ యూనిట్ ను ఏర్పాటు చేసి ప్లాస్టిక్ నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈవిషయంలో చురుగా పనిచేసే పంచాయితీలకు బహుమతులు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని సిఎస్ సూచించారు. మంజూరు చేసిన సాలిడ్ వేస్ట్,లిక్విడ్ వేస్ట్ మేనేజిమెంట్ యూనిట్లను  త్వరితంగా పూర్తి చేసేందుకు జిల్లాల వారీగా లక్ష్యాన్ని నిర్దేశించి ఆప్రకారం సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేయాలని ఆదేశించారు.వచ్చే డిశంబరు నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా అన్ని గ్రామాలను జూన్ 2నాటికి నూరు శాతం బహిరంగ మలవిసర్జన(ఓడిఎఫ్)రహిత గ్రామాలుగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. అలాగే గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణ కార్యక్రమాన్ని వేగవతంగా పూర్తి చేయాలని చెప్పారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన చేతిపంపులు పనిచేయకుంటే వాటిని తక్షణం పునరుద్దరించాలని ఆలా సాధ్యం కాని పక్షంలో ప్రత్యామ్నాయ రీచార్చి స్ర్టక్చర్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను సిఎస్ ఆదేశించారు.చంద్రన్న కాంతి పధకం కింద అన్ని గ్రామాల్లో నూరు శాతం ఎల్ఇడి వీధి దీపాల ఏర్పాటును సకాలంలో పూర్తి చేయాలని చెప్పారు.అనంతరం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పధకం,నీటి కుంటల తవ్వకం (ఫారమ్ పాండ్స్),విలేజ్ పార్కులు, ఎన్టిఆర్ జలసిరి,పంచాయితీ రహదార్లు, మొక్కలు నాటే కార్యక్రమం,కొండలు,గుట్టలపై పచ్చదనాన్ని పెంపొందించేందుకు తీసుకున్న చర్యలను సిఎస్ దినేష్ కుమార్ సమీక్షించగా ఆయా శాఖల అధికారులు శాఖల వారీ ప్రగతిని సిఎస్ కు వివరించారు.తొలుత తాగునీరు,పారిశుద్ధ్యం విభాగపు కార్యదర్శి బి.రామాంజనేయులు ఆవిభాగపు ప్రగతిని వివరిస్తూ ఓడిఎఫ్ గ్రామాలుగా ప్రకటించేందుకు జూన్ 2వతేదిని తుది గడువుగా విధించడం జరిగిందని తెలిపారు.ఇప్పటి వరకూ రాష్ట్రంలోని 13 జిల్లాలు ఓడిఎఫ్ జిల్లాలుగా ప్రకటించగా వాటిలో ఇప్పటి వరకూ 77శాతం గ్రామ పంచాయితీలు ఓడిఎఫ్ గా ప్రకటించబడ్డాయని వివరించారు.9వేల సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ యూనిట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకూ 2వేల వరకూ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి కెఎస్.జవహర్ రెడ్డి ఉపాధిహామీ పధకం అమలుపై మాట్లాడుతూ ఈఆర్ధిక సంవత్సరంలో 7వేల 243 కోట్ల రూ.లు వ్యయం చేయాల్సి ఉండగా ఇప్పటికే 1836కోట్ల రూ.లు ఖర్చు చేసి వివిధ పనులు చేపట్టడం ద్వారా కూలీలకు ఉపాధి కల్పించడం జరిగిందన్నారు.అలాగే లక్షా 30వేల 259 ఫారమ్ ఫాండ్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికే లక్షా 15వేల ఫాండ్లు నిర్మాణం చేపట్టి 15వేల 247 పూర్తి చేయడం జరిగిందన్నారు.ఫారమ్ పాండ్లు ఏర్పాటు వల్ల ఎంతమేరుకు ప్రయోజనం ఉందనేదానిపై ధర్డ్ పార్టీ విచారణ చేపట్టాలని సిఎస్ చెప్పారు.ఈసమావేశంలో ఆర్ధికశాఖ ఇన్చార్జి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.రవిచంద్ర,పిఆర్ ఆండ్ ఆర్డీ సంచాలకులు రంజిత్ భాషా,ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts