హైదరాబాద్
సంక్రాంతికి టాలీవుడ్ సినిమాలు పెద్దఎత్తున పోటీకి సిద్ధమయ్యాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతలు సమావేశమై సినిమాల రిలీజ్పై తలెత్తిన సమస్యలపై చర్చిం చారు.
ఈ సమావేశానికి హాజరైన నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా లో వస్తున్న ఆర్టికల్స్తో ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తోం దని అన్నారు. ఎవరైనా సరే నిజాలు తెలుసుకొని రాయండని దిల్ రాజు కోరారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలతో ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తోందని,దయచేసి నిజాలు తెలు సుకొని రాయాలని, సంక్రాంతికి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నిర్మాతలతో చర్చించామని, ఒక సినిమా వెనక్కి తగ్గితే ఏదో జరిగినట్టు కాదని, గతేడాది మూడు సినిమాలకే రచ్చరచ్చ చేశారని,ఇప్పుడు 5 సినిమాలు పోటీ లో ఉన్నాయని, మేమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సంక్రాంతి బరి నుంచి ఏదైనా సినిమా వెనక్కు తగ్గితే, రాబోయే రోజుల్లో ఫిలింఛాంబర్ తరఫున ఆ సినిమాకు సోలో రిలీజ్ డేట్ ఇస్తామని తెలిపారు దిల్ రాజు. సమ్మర్ సీజన్ లో కూడా కొన్ని ఖాళీ డేట్స్ ఉన్నా యని, వాటిని కేటాయింటే అవకాశం ఉందని ఊరించారు..