తిరుపతి
బిజెపి మాజీ ఎంపి సుబ్రమణ్యం స్వామి శుక్రవారం తిరుపతి జిల్లా కోర్టుకు వచ్చారు. టీటీడీ వెబ్ సైట్ లో అన్యమత ప్రచారం చేస్తున్నారని ఆంధ్రజ్యోతి దినపత్రిక గతంలో ఒక వార్త ప్రచురించింది. దాంతో టీటీడీ దినపత్రికపై కేసు దాఖలు చేసింది. సుబ్రమణ్యం స్వామి
ఆంధ్రజ్యోతి దినపత్రికపై వందకోట్ల పరువు నష్టం దావా కేసు దాఖలు చేసారు. కేసు విచారణలో భాగంగా తిరుపతి కోర్టుకు హాజరై అయన టీటీడీ జత చేసిన పత్రాలను పరిశీలించారు.
సుబ్రమణ్యం స్వామి మాట్లాడుతూ న్యాయవాదుల సమ్మె కారణంగా కేసు విచారణ ఫిబ్రవరి 5 తేదీకి వాయిదా వేసారు. తాను రిజిస్టర్ న్యాయవాది కానందున కేసులు వాదించేందుకు జడ్జి అంగీకరించలేదు. హై కోర్టు ద్వారా ప్రత్యేక ఉత్తర్వులు తీసుకు వచ్చా. కేసులో వాదనలు వినిపించేందుకు వచ్చా. న్యాయవాదుల సమ్మె కారణంగా కేసు వాయిదా పడింది. టీటీడీ ప్రతిష్ట దెబ్బ తీసేందుకు అసత్య వార్తను ప్రచురించారు. దేవస్థానం అన్ని ఆధారాలు కోర్టుకు సమర్పించిందని అన్నారు.