YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

'ప‌ద్మావ‌త్‌ రోజు మంచి వ‌సూళ్ళ‌నే రాబ‌ట్టుకుంది...

 'ప‌ద్మావ‌త్‌ రోజు మంచి వ‌సూళ్ళ‌నే రాబ‌ట్టుకుంది...

- రూ.19 కోట్ల వ‌సూళ్ళు ..

ఎన్నో వివాదాల మ‌ధ్య విడుద‌లైన'.. తొలి 'ప‌ద్మావ‌త్‌ రోజు మంచి వ‌సూళ్ళ‌నే రాబ‌ట్టుకుంది. కొన్ని చోట్ల ప్ర‌ద‌ర్శ‌న లేక‌పోయినా, మ‌రికొన్ని చోట్ల నిర‌స‌న‌లు, గంద‌ర‌గోళం నెల‌కొన్నా.. తొలి రోజు (గురువారం) ఈ సినిమాకి రూ.19 కోట్ల వ‌సూళ్ళు ద‌క్కాయి . ఇక ప్రీమియ‌ర్స్  సంద‌ర్భంగా వ‌చ్చిన రూ.5 కోట్లను కూడా క‌లుపుకుంటే.. రూ.24 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ళు ద‌క్కాయి. ఒక‌వేళ‌.. ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సినిమా రిలీజై ఉంటే.. రూ.28 కోట్ల నుంచి రూ.30 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ళు రాబ‌ట్టుకునేద‌ని ట్రేడ్ ఎన‌లిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ పేర్కొన్నారు. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ఈ రోజు (శుక్ర‌వారం) మంచి కలెక్ష‌న్లు ఉన్నాయ‌ని ఆయ‌న తెలిపారు. శ‌ని, ఆది వారాల్లోనూ ఈ సినిమాకి భారీ స్థాయిలో వ‌సూళ్ళు రావ‌చ్చ‌ని ఆయ‌న విశ్లేషించారు. సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 'ప‌ద్మావ‌త్‌'లో దీపికా ప‌దుకొణ్‌, ర‌ణ్‌వీర్ సింగ్‌, షాహిద్ క‌పూర్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. జ‌న‌వ‌రి 25న హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో అనువాద రూపంలో విడుద‌లైందీ సినిమా.

Related Posts