YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

నోరూరించే ఫలుదా

నోరూరించే ఫలుదా

హైదరాబాద్‌లో భానుడి ప్రతాపానికి నగరవాసులు విలవిల లాడుతున్నారు. ఈ  వేసవి తాపానికి దాహం తీర్చుకోవటానికి ప్రజలు అనేక రకాల పానీయాల వైపు చూస్తున్నారు. అయితే ఈ వేసవిలో నగరవాసులను అత్యంత ప్రియంగా ఆకర్షిస్తున్న పానీయం ఫలుధా. ఇంత రుచికరమైన సీతల పానీయం మన నగరంలో కొన్ని చోట్ల మాత్రమె దోరుకుతుంది. నోరురించే ఈ పానీయం గురించి మరి మనం కుడా తేలుసుకొవాలంటే వాచ్‌ ది స్టోరీ.సమ్మర్‌లోను, మరియు రంజాన్‌ మాసంలో నగరవాసులు ఎక్కవగా ఫలూదా  తాగుతారు. ఇది సమ్మర్‌లో ఎండ తాపాన్ని తట్టుకొవటానికి కూడా తాగుతారు. దీనిలో సబ్జా గింజలను వాడటంవల్ల సలవచేసి వడదెబ్బ నుండి తట్టుకొవచ్చు. దినిలో కలిపే ఇన్‌ గ్రిడియన్స్‌ వల్ల తక్షణ ఉపశమనం పొంది, శరీరానికి సరిపడ శక్తిని సమకూర్చతుంది. ఈ ఫలుధాను అనేక రకాల ప్ల్యావర్స్‌ లో తయారు చేసుకొవచ్చు.  మ్యాంగో , ఆరంజి, సేమ్యా, స్టాబెర్రి, లస్సీ, ఇంక అనేక రకాలైన ప్రూట్స్‌ తో కుడా తయారుచేసుకొవచ్చు. ఇంత రుచికరమైన మరియు శరీరానికి శక్తిని ఇచ్చే ఫలుధాను నగరవాసులు ఎంతో ఇష్టంగా సేవిస్తున్నారు. ఫలుధా తయారీ :  సబ్జ గింజలు, రోజు సిరప్‌, సేమ్యా, స్టాబెర్రి, మిల్క్‌, ఐస్, బాదం, పిస్తా, అంజూరపు ముక్కలు, ఐస్‌ క్రీమ్‌, పంచదార,పాలు, ప్రూట్స్‌. వంటివి కలిపి ఫలూదా ను తయారు చేస్తారు.రంజాన్‌ మాసంలో కుడా ఫలుధాను ఏక్కువగా తాగుతారు. ముస్లిం సోదరులు ప్రవిత్ర రంజాన్‌ మాసంలో నిష్టగా 13 గం.లు ఉపవాసం ముగించుకున్న తరువాత  అనేక రకాల పోషకాలు కలిగినటువంటి పానీయం ఫలుధాను సేవిప్తారు. అలాగే ముస్లింలకు సాంప్రదాయ వటకం అయినటువంటి హలీంను ముస్లింలతో పాటు నగరవాసులు కుడా ఎంతో ఇష్టంగా తింటారు.  హైదరాబాద్‌లో హలీంకి ఎంతో ప్రాచుర్యం పోందినటువంటి షా గౌస్‌ కేఫ్‌ అండ్‌ రెస్టారెంట్‌ చార్మినార్‌ మరియు టోలీ చౌక్‌ లో ఉంది. చార్మినార్‌ కి కూతవేటు దూరంలో ఈ మహానగర గుర్తింపు కట్టడాన్ని చూస్తూ హలీం ని ఆస్వాదించవచ్చు. పక్కా ఓల్డ్‌ సిటి ప్లేవర్‌ కనిపిస్తుంది కేవలం నాలికే కాదు మనస్సూ ఆ రుచిని ఆస్వాదింస్తుంది. ఒక వేళ ఏ మాత్రం అవకాశం ఉన్న షా గౌస్‌ రెస్టారెంట్‌ లో హలీం ని మిస్‌ కాకండి. ఇక్కడ హలీం ఆస్వాదించటం ఒక అద్బుతమైన అనుభూతి...

Related Posts