YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వెస్ట్ లో గెలిస్తే... ఇక రైట్.. రైట్..

వెస్ట్ లో గెలిస్తే... ఇక రైట్.. రైట్..

భీమవరం, జనవరి 19,
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పశ్చిమ గోదావరి జిల్లాది ప్రత్యేక స్థానం. అచ్చం తూర్పుగోదావరి జిల్లా లాగే.. ఈ జిల్లాలో మెజార్టీ సీట్లు దక్కించుకునే పార్టీయే రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. అలా ఒకటీ రెండూ సార్లు కాదు.. దాదాపు ఐదు దఫాలుగా అదే జరుగుతూ వస్తోంది. గత ఐదు దఫాలుగా ఎన్నికల సరళిని చూస్తే.. పశ్చిమాన గెలుపు కీలక మలుపు అన్నట్టుగానే ఉంది. ఇక్కడ మెజార్టీ సీట్లు సాధించుకున్న పార్టీనే అధికారంలోకి వస్తున్న సంస్కృతి కనిపిస్తోంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1999 ఎన్నికల నుంచి గత ఎన్నికల వరకు ఇదే కొనసాగింది. కాంగ్రెస్‌, టీడీపీతో పాటు ఇప్పుడు వైసీపీ వరకు అన్ని పార్టీలు పశ్చిమ గోదావరి జిల్లాలో అధిక స్థానాలు దక్కించుకొనే ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. దీంతో వచ్చే ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీలన్నీ ఈ జిల్లాపైనే దృష్టి కేంద్రీకరించాయి. అధికార వైసీపీతో పాటు.. ఈసారి కూటమిగా బరిలోకి దిగుతున్న టీడీపీ-జనసేన ఇక్కడ మెజార్టీ సీట్లు సాధించి.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వ్యూహాలు రచిస్తున్నాయి.
1999లో ఏపీలో అధికారం చేపట్టిన టీడీపీ
180 సీట్లు వచ్చాయి
పశ్చిమ గోదావరి జిల్లాలో గెలుపొందిన స్థానాలు 14(మొత్తం సీట్లు 16)
2004లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ
వైఎస్ సీఎం అయ్యారు, కాంగ్రెస్ కు వచ్చిన సీట్లు 188(మొత్తం సీట్లు 294)
పశ్చిమ గోదావరి జిల్లాలో గెలుపొందిన స్థానాలు 12(16)
2009లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ
156 సీట్లు వచ్చాయి
పశ్చిమ గోదావరి జిల్లాలో గెలుపొందిన స్థానాలు 9(మొత్తం స్థానాలు 15)
2014లో విజయం సాధించిన టీడీపీ
రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు
175 స్థానాలకు గాను 102 స్థానాలు గెల్చిన టీడీపీ
పశ్చిమ గోదావరి జిల్లాలో గెలుపొందిన స్థానాలు 14 (మొత్తం 15 స్థానాలు)
2019లో విజయం సాధించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ
175 స్థానాలకు గాను 151 స్థానాల్లో విజయం
పశ్చిమ గోదావరి జిల్లాలో గెలుపొందిన స్థానాలు 13 (మొత్తం 15 స్థానాలు)

Related Posts