YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

12 కోట్ల మందికి ముద్రా యోజన

12 కోట్ల మందికి ముద్రా యోజన
ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) పథకం కింద దేశంలో ఇప్పటివరకు..12 కోట్ల మంది లబ్ధిపొందారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. మంగళవారం (మే 29)న పీఎంఎంవై లబ్ధిదారులతో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా 12 కోట్ల మంది లబ్ధిదారులకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రూ. 6లక్షల కోట్ల రుణాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. లబ్ధిదారుల్లో దాదాపు 9 కోట్ల మంది మహిళలే ఉన్నారని, వీరిలో సగానికి సైగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందినవారేనని మోదీ అన్నారు. మిగతా 3 కోట్ల మంది తొలిసారిగా వ్యాపారంలోకి అడుగుపెట్టారని తెలిపారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే యువతకు, మహిళలకు 'ప్రధానమంత్రి ముద్రా యోజన' సరికొత్త అవకాశాలు కల్పిస్తోందని.. ఈ సందర్భంగా మోదీ అన్నారు. ఈ పథకం ద్వారా కార్పొరేటేతర వ్యక్తులు తమ వ్యాపార అవసరాల కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ. 10లక్షల వరకు రుణాలు తీసుకోవచ్చు. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని 2015 ఏప్రిల్‌ 8న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ముద్రా రుణాలు పొందడానికి భారత పౌరుడై ఉండి, వ్యవసాయేతర వ్యాపార ఆదాయ ప్రణాళిక సూచించే విధంగా ఉండాలి, ఉదాహరణకు తయారీ, ప్రాసెసింగ్, వ్యాపార లేదా సేవా రంగాల్లో మీ ప‌రిశ్ర‌మ‌, ఆలోచ‌న ఉండొచ్చు. రుణ అవసరం రూ.10 లక్షల లోపు ఉండాలి. పైన పేర్కొన్న అర్హత గల వారు దగరలో వున్నబ్యాంక్, సూక్ష్మ ఋణ సంస్థ (ఎంఎఫ్‌ఐ), లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) అధికారులను సంప్రదించాలి

Related Posts