YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

420 హామీలను చేసేదాకా విడిచి పెట్టం కేటీఆర్

420 హామీలను చేసేదాకా విడిచి పెట్టం కేటీఆర్

హైదరాబాద్
మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ గుళ్ళ అయ్యిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విఫలం అయ్యిందని అబద్ధాలు మాట్లాడించారు.  అందుకే స్వేద పత్రం విడుదల చేశాం. తెలంగాణ సమగ్ర అభివృద్ధిని పొందుపరిచాం. గణాంకాలు, ఆధారాలతో సహా వివరించాం. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు. మొత్తం లెక్క తెస్తే 420 హామీలు ఇచ్చారు. దీన్ని ఎండగట్టే బాధ్యత మనందరి మీద ఉంది.  రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉండి, అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణం తెచ్చుకోండి అన్నరు.  తుమ్మల నాగేశ్వర రావు రుణాలు వసూలు చేయాలి అని ఆదేశాలు జారి చేశారు. లేకుంటే కేసులు పెట్టండి అని అంటున్నాడు. పత్రికల్లో కూడా వచ్చింది.  ప్రియాంక గాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెబితే, భట్టి గారు భృతి ఇస్తామని చెప్పలేదని హరీష్ రావు గారు అడిగిన ప్రశ్నకు అసెంబ్లీ సాక్షిగా అబద్దం చెప్పారు.  పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తామని హామి ఇచ్చారు. కానీ అది సాధ్యం కాదని మొన్న స్పష్టమైంది.
నోటికి ఎంత వస్తె అంత అనుకుంటూ హామీలు ఇచ్చారు. అందుకే 420 హామీలను చేసేదాకా విడిచి పెట్టం. ప్రధాని, ఆదాని ఒక్కటని విమర్శలు చేసిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నేడు ఆయనతోనే ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాహుల్ గాంధీ నిన్ననే అధానిని తిడితే, రేవంత్ రెడ్డి అదే సమయంలో దావొస్ లో ఒప్పందం చేసుకున్నారని అన్నారు.
నోటికి వచ్చినట్లు మాట్లాడిన కాంగ్రెస్, బిజెపి నాయకుల అసలు రంగు బయట పడుతున్నది. కెసిఆర్ ఉన్నంత కాలం ఆదాని ఇక్కడ అడుగు పెట్టలేదు. కానీ కాంగ్రెస్ రాగానే ఎలా అడుగు పెడుతున్నాడు. కెసిఆర్,  హరీశ్ రావు నాయకత్వంలో క్రియాశీలకంగా పని చేయడంతో గత ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించాం. ఈసారి కూడా మెదక్ లో గులాబీ జెండా ఎగరబోతున్నది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గత పదేళ్ళలో తెలంగాణ తరుపున గళం విప్పింది మన బి ఆర్ ఎస్ ఎంపీలు అనే విషయం మరచి పోవద్దు.  రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది బి ఆర్ ఎస్ మాత్రమే. మన బలం, మన గళం, మన గులాబీ జెండా పార్లమెంట్ లో ఉండాలి. లేకుంటే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరిగుతుందని. ఇదే విషయం ప్రజలకు చెప్పాలి. నిరాశ వీడాలి. బయటికి రావాలని అన్నారు.

Related Posts