YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పొలిటికల్ పార్టీలకు ఫ్యామిలీ స్ట్రోక్

పొలిటికల్ పార్టీలకు ఫ్యామిలీ స్ట్రోక్

విజయవాడ, జనవరి 20,
ఎన్నికల వేళ పొలిటికల్ పార్టీలకు కొత్త టెన్షన్ వెంటాడుతోంది. పొలిటికల్ పార్టీలకు ఫ్యామిలీ స్ట్రోక్ తప్పడం లేదు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమికి పరోక్షంగా కేటీఆర్, కవిత కారణమనే టాక్ ఉంది. కవిత లిక్కర్ స్కాం వ్యవహారం ఓ వైపు, కేటీఆర్ అహంకారం మరో వైపు బీఆర్ఎస్‌ను దెబ్బతీశాయనే చర్చ ఎన్నికల ఫలితాల అనంతరం జోరుగా సాగింది. కుటుంబంలోని అందరికి కేసీఆర్ పదవులు కట్టబెట్టారనే ప్రచారం సైతం బీఆర్ఎస్‌కు ఎన్నికల ఫలితాల్లో ప్రతికూలంగా మారింది. ప్రజల విశ్వసనీయత కోల్పోయిన తరుణంలో ఎంపీ ఎలక్షన్స్‌లో సైతం బీఆర్ఎస్‌కు షాక్ తప్పదనే టాక్ నడుస్తోంది. మళ్లీ కవిత వ్యవహారాన్ని తెరపైకి తేవడంతో గులాబీ పార్టీకి చిక్కులు తప్పవనే చర్చ సాగుతోంది.ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ పొలిటికల్ ఫ్యామిలీ వార్ పీక్స్‌కు చేరుకుంది. తెలంగాణలో వైఎస్సాఆర్టీపీ పార్టీతో తన మార్క్ పాలిటిక్స్ చూపిన షర్మిల ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్‌గా నియమించడంతో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే జగన్ పథకాలను, పాలనను షర్మిల ఎండగడతారా..? ఒక వేళ సీఎం జగన్ పాలనను ప్రశ్నించకుంటే అక్కడి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా అనేది హాట్ టాపిక్‌గా మారింది. షర్మిల ఎంట్రీతో వైసీపీకే లాభమని ఓ వాదన ఉండగా.. షర్మిల నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది.అక్కడ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగి దూకుడుగా వ్యవహరిస్తారా..? అనేది తేలాల్సి ఉంది. మరో వైపు కుమారుడి ఎంగేజ్‌మెంట్‌లో సైతం సీఎం జగన్‌తో షర్మిల సఖ్యతగా ఉన్నట్లు ఎక్కడా కనిపించలేదు. దీంతో రాజకీయాల పరంగా షర్మిల స్టాండ్ ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. ఆమె పోటీ చేసే స్థానంపై కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వైసీపీ నేతలు షర్మిలను టార్గెట్ చేసి కామెంట్స్ చేస్తారా..? దానికి జగన్ సైలెంట్‌గా ఉండి యాక్సెప్ట్ చేస్తారా వంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.టీడీపీకి గతంలో మద్దతు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని రోజులుగా సైలెంట్ అయ్యారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్ట్‌ను సైతం ఆయన ఖండించలేదు. అంతకు ముందు చంద్రబాబు భార్యపై అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై ఆయన రియాక్ట్ అయ్యారు. తాజాగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాలని ఆదేశించడంతో ఒక్క సారిగా బాలకృష్ణ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రెండుగా విడిపోయారు. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ మధ్య వార్ స్టార్ట్ అయింది.ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఎఫెక్ట్ చూపుతుందనేది రాజకీయ విశ్లేషకుల మాట. అయితే ఎన్నికల సమయంలో ఓపిక పడితేనే సానుకూల ఫలితాలు వస్తాయని.. ఇలా సొంత పార్టీలో ఫ్యాన్స్, కేడర్ చీలిపోతే ఆ పార్టీకే నష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి షర్మిల, జగన్‌కు నష్టం చేస్తారా..? ప్రభుత్వ వ్యతిరేఖ ఓట్ల చీలికతో లాభం చేస్తారా..? టీడీపీలో నందమూరి బాలకృష్ణ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్ ఎన్నికల నాటికి కంటిన్యూ అయితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయనేది తేలాల్సి ఉంది.

Related Posts