YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నెగిటివ్ ప్రచారం నమ్ముకున్నటీడీపీ, జనసేన

నెగిటివ్ ప్రచారం నమ్ముకున్నటీడీపీ, జనసేన

నెల్లూరు, జనవరి 20,
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అనేక కారణాలున్నాయి. అందులో ఒక కారణం కాంగ్రెస్ ఎన్నికల సమయంలో రూపొందించిన నెగిటివ్ ప్రచారం. ఈ యాడ్స్ ప్రజల్లోకి వేగంగా వెళ్లడమే కాకుండా ఆకట్టుకునేలా ఉండటంతో ప్రజలు పార్టీ వైపు మొగ్గు చూపారన్న ఒక అంచనాలు మాత్రం వినిపించాయి. ఇప్పుడు అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీ మీద కూడా తెలుగుదేశం పార్టీ నెగిటివ్ ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు యాడ్స్ రూపొందించే వారికి ఈ పనిని అప్పగించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి యాడ్స్ రూపొందించిన వారి చేతనే ఈ ప్రకటనలు తయారు చేయించే పనిలో సైకిల్ పార్టీ ఉంది. షర్మిలను మార్చరన్న గ్యారంటీ ఉందా? ప్రజలను ఆకట్టుకోవాలంటే... తెలంగాణ ఎన్నికల్లో "పదేళ్ల అహకారం పోవాలి.. పదేళ్ల విధ్వంసం పోవాలి","మార్పు రావాలి - కాంగ్రెస్ కావాలి" అన్న నినాదాలు కూడా ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్లాయి. కారు పంక్చర్ అయినట్లు చూపించిన యాడ్స్ కాంగ్రెస్ ను ప్రజలకు మరింత చేరువ చేశాయని టీడీపీ అధినేత చంద్రబాబు సయితం విశ్వసిస్తున్నారు. ఐదేళ్ల విధ్వంసం అంటూ యాడ్స్ రూపొందించాలని ఇప్పటికే కొన్ని కంపెనీలకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. అలాగే ఫ్యాన్ రెక్కలు విరిగినట్లు కూడా ఈ యాడ్స్ ద్వారా చూపించి ప్రజలకు పార్టీని చేరువ చేసేలా చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. పాజిటివ్ యాడ్స్ కంటే ప్రజలను నెగిటివ్ యాడ్స్ నే ఎక్కవగా ఆకట్టుకుంటాయన్న విషయం తెలంగాణ ఎన్నికల్లో స్పష్టం కావడంతో టీడీపీ కూడా అదే బాటలో పయనిస్తుంది. నెగిటివ్ యాడ్స్ మాత్రమే కాకుండా టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ తో పాటు అనేక రకాలుగా ఇచ్చిన హామీలతో కూడా యాడ్స్ ను రూపొందించాలని నిర్ణయించారు. పాజిటివ్ వే లో వెళ్లేకంటే నెగిటివ్ తోనే వెళ్లడం మంచిదని టీడీపీ యూత్ వింగ్ కూడా సూచించడంతో ఆ దిశగా యాడ్స్ రూపొందిస్తున్నారని తెలిసింది. ఎటూ అధికార పార్టీ తాము అమలు చేసిన సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందని, వాటిని ఎండగడుతూ వ్యతిరేకంగా ప్రకటనలు రూపొందిస్తే అవి ఎక్కువ ఆకట్టుకుంటాయని సీనియర్ నేతలు కూడా భావిస్తున్నారు. అమరావతి ఈ ఐదేళ్లలో ఎలా నాశనం అయిందో కూడా ఈ యాడ్స్ ద్వారా తెలియజేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కినదానిని కూడా ప్రస్తావించనున్నారు. దుబాయ్ నుంచి ఏపీకి వచ్చిన మహిళ ఆటోలో ఇంటికి వచ్చి రహదారులు బాగాలేక నడుములు పోయినట్లు నటించిన యాడ్ ఒకటి వైరల్ అవుతుంది. ఇప్పటికే యాడ్స్ కు సంబంధించి షూటింగ్ ప్రారంభమయినట్లు ఒక సీనియర్ నేత తెలుగు పోస్ట్ కు తెలిపారు అయితే ఇప్పటికిప్పుడు కాకుండా ఎన్నికల సమయంలో నెగిటివ్ యాడ్స్ ప్లే అయ్యేలా చూడాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినా, కోర్టును ఆశ్రయించినా ఇబ్బందులు పడాల్సి వస్తుందని, అందుకనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే నెగిటివ్ యాడ్స్ ను ఎక్కువగా ప్లే చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఈ యాడ్స్ రూపకల్పనలో ఒక ముఖ్య పాత్రికేయుడు కూడా సలహాలు, సూచనలు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో హైదరాబాద్ లోని ఒక కంపెనీలో ఈ ప్రకటనలు తయారవుతున్నాయి. నోటిఫికేషన్ తర్వాత ఈ యాడ్స్ టీవీల్లో కనిపించేలా తెలుగు దేశం పార్టీ అధినేత ప్లాన్ చేశారు. మొత్తం మీద తెలంగాణలో కాంగ్రెస్ అనుసరించిన తరహాలోనే ఏపీలోనూ టీడీపీ వ్యవహరించాలని డిసైడ్ అయింది. ఇప్పటికే కొన్ని యాడ్స్ సోషల్ మీడియాలో దర్శనమిస్తుండటం విశేషం.

Related Posts