YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సంక్రాంతికి ఎన్టీఆర్, వైఎస్ఆర్

సంక్రాంతికి ఎన్టీఆర్, వైఎస్ఆర్
ఎట్టకేలకూ ఎన్టీఆర్ బయోపిక్‌కు దర్శకుడు దొరికేశాడు. బాలయ్య సంకల్పించిన ఈ సినిమాకు క్రిష్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడని అధికారికంగా ప్రకటన వచ్చేసింది. తేజ తప్పుకున్నప్పటి నుంచి కాస్త గందరగోళంలో పడిన ఈ సినిమా క్రిష్ ద్వారా మళ్లీ పట్టాలెక్కబోతోంది. వేగంగా సినిమాను రూపొందించడంలో క్రిష్‌కు ప్రత్యేకత ఉంది. ఇది వరకూ ‘గౌతమీపుత్ర శతకర్ణి’ సినిమాను చాలా త్వరగా పూర్తి చేశాడు ఈ దర్శకుడు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్‌ విషయంలో కూడా అదే వడి చూపుతాడనే అంచనాలున్నాయి. ఎలాగైనా ఎన్టీఆర్ బయోపిక్‌ను వచ్చే సంక్రాంతి సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది బాలయ్య ఆకాంక్ష. ఆ మేరకు క్రిష్ కూడా సినిమాను పూర్తి చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ బయోపిక్ కూడా సంక్రాంతికే రాబోతుండటం విశేషం. మహీ వీ రాఘవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో వైఎస్ పాత్రలో మమ్ముట్టీ నటిస్తున్నాడు. ఇక ఇతర ప్రధాన తారాగణం ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాను ప్రధానంగా వైఎస్ పాదయాత్ర ‘ప్రజాప్రస్థానం’ ఆధారంగా రూపొందిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ‘యాత్ర’ అని టైటిల్ కూడా పెట్టారు. సినిమాకు స్క్రిప్ట్‌ కూడా రెడీ అయిపోయినట్టుగా తెలుస్తోంది. తారాగణం పూర్తిగా కుదిరితే ఈ సినిమా శరవేగంగానే పూర్తై సంక్రాంతి సందర్భంగా విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విధంగా సంక్రాంతి సందర్భంగా ఒకనాటి ఏపీ ముఖ్యమంత్రుల బయోపిక్స్ రెండు విడుదల కానున్నాయని సమాచారం.

Related Posts