YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కొత్త టీమ్ కోసం పెద్ద కసరత్తు

కొత్త టీమ్ కోసం పెద్ద కసరత్తు

హైదరాబాద్, జనవరి 20,
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై నిరుద్యోగుల్లో నమ్మకం కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. టీఎస్పీసీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి… కొత్త టీమ్‌ను ఎంపిక చేయనుంది. ఇందుకోసం  టీఎస్పీసీ చైర్మన్‌ అండ్ టీమ్‌ ఎంపికపై కసరత్తు చేస్తోంది. దీంతో ఇప్పుడు  టీఎస్పీసీ కొత్త బాస్‌ ఎవరనేది హాట్‌టాపిక్‌గా మారింది.తెలంగాణలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  టీఎస్పీసీ ప్రక్షాళనకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ని ప్రక్షాళన చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి… ఆ దిశగా వేగం పెంచారు.  పాలకమండలి రాజీనామాలకు గవర్నర్‌ ఆమోదం తెలపడంతో ఇప్పుడు కొత్త బోర్డు ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది.ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, వారి తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించే విధంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా చైర్మన్‌ అండ్ బోర్డు సభ్యుల ఎంపికపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రక్షాళన రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఎంతో ప్రతిష్టాత్మకం. గత ప్రభుత్వ హయాంలో టీఎస్పీసీ  నిర్వహించిన పరీక్షల లీకేజీలు.. ఎన్నికలు సమీపివేస్తున్న వేళ హడావుడిగా నోటిఫికేషన్లు వేసి కోర్టు మెట్లు ఎక్కడం లాంటివాటితో బోర్డు అప్రతిష్టపాలైంది. దీంతో ఎన్నికల ప్రచారంలో బోర్డు ప్రక్షాళనలపై రేవంత్‌రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు.దీంతో ఇప్పుడు కొత్త టీమ్ ఎంపికతోనే ప్రజలకు భరోసా ఇవ్వాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే టీఎస్పీసీ  ఛైర్మన్, సభ్యుల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించింది. దీంతో ప్రభుత్వానికి భారీగా దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణలోని ఉస్మానియా, జేఎన్టీయూ, కాకతీయ యూనివర్సిటీలతో పాటు.. ప్రైవేట్ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్స్ స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. చైర్మన్‌తో పాటు, 10 మంది సభ్యులతో పాలకమండలి ఉంటుంది. వీరిలో సగం మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేసి ఉండాలన్నది నిబంధన. దీంతో ఇప్పుడు బోర్డు ఎంపికలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే చైర్మన్‌గా మంచి ట్రాక్‌ రికార్డ్ ఉన్న IPS అధికారిని ఎంపిక చేస్తే నిరుద్యోగుల్లో నమ్మకం వస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనగా ఉంది. దీంతో మొన్నటిదాకా కమీషనర్‌గా పనిచేసిన IPS అధికారి పేరును సీఎం పరిశీలనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఆ అధికారికి ఇంకా ఐదేళ్ల సర్వీస్‌ ఉండటంతో దాన్ని వదులుకునేందుకు అతను సిద్ధంగా లేరన్న చర్చ సాగుతోంది.అయితే ఈ మధ్య రిటైర్డ్ అయిన ఓ అధికారి పేరును కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉంది. ఇక మాజీ IAS ఆకునూరి మురళీ, ప్రొఫెసర్ కోదండరాం, హరగోపాల్, నాగేశ్వర్‌ పేర్లను పరిశీలించినప్పటికీ… టీఎస్పీసీ  నిబంధనల మేరకు వయస్సు పరిమితి సరిపోవడం లేదు.ఒకవేళ వీలుకాకపోతే… ఎగ్జామీనేషన్స్‌ నిర్వహణలో అనుభవం ఉన్న ప్రొఫెసర్స్ వైపు తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపనుంది. ఇప్పటికే HCU, OU, JNTU, కాకతీయ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న మంచి ట్రాక్‌ రికార్డ్ ఉన్న ప్రొఫెసర్స్‌ను ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.ఇప్పుడు వచ్చిన దరఖాస్తులను స్క్రీనింగ్ చేసి… చైర్మన్‌, సభ్యులుగా ఎంపిక కోసం ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీ వేయనుంది. దీనిద్వారా అన్ని కోణాల్లో పరిశీలించి, పాలకమండలి ఎంపికను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేయనుంది. అది కూడా పారదర్శకంగా ఈ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా ప్రజలకు మంచి మేసేజ్‌ ఇవ్వాలని భావిస్తోంది. చూడాలి మరి టీఎస్పీసీ  చైర్మన్ అండ్ టీమ్‌లో ఎవరిని ఎంపిక చేస్తారో..

Related Posts