YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అంగన్వాడీల అందోళన…స్థంభించిన ట్రాఫిక్

అంగన్వాడీల అందోళన…స్థంభించిన ట్రాఫిక్

ఆలూరు
అంగన్వాడి ఆశ వర్కర్ల రిలే నిరాహార దీక్షకు మద్దతుగా ఆలూరు అంబేద్కర్ సర్కిల్లో వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది.
ప్రభుత్వం వైఖరి నశించాలంటూ అంగన్వాడి ఆశ వర్కర్ల కనీసం వేతనం పెంచాలంటూ భారీ ఎత్తున ఆందోళనకు దిగారు.దీంతో వాహానాలు భారీగా నిలిచిపోయాయి. వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

అంగన్వాడీల అరెస్టు
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలు  పెంపుదల చేస్తూ వెంటనే ప్రకటన చేయాలని, సమస్యలను పరిష్కరించాలని కార్మిక,ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ  శ్రీకాకుళం డే &నైట్ బ్రిడ్జి వద్ద కార్మిక సంఘాలు , ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్భంగా కార్మిక, ప్రజా సంఘాలు నాయుకులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1,10,000 మంది అంగన్వాడి అక్క చెల్లెమ్మలు గత 40 రోజులుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని విమర్శించారు. పండగ రోజుల్లో కూడా వేలాదిమంది అంగనవాడి రోడ్డుపై కొచ్చి పోరాటం చేస్తున్న ప్రభుత్వంలో చలనంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న అంగన్వాడీల సమ్మెను ఎస్మాపరిధిలోకి తీసుకువచ్చి సమ్మెను నిషేదించడం అప్రజాస్వామికని అన్నారు. న్యాయబద్ధమైన సమ్మెను బెదిరింపుల ద్వారా, నిరంకుశ చర్యలతో విచ్ఛిన్నం చేయాలనుకోవడం పచ్చి నియంతృత్వమని అన్నారు. పోలీసులు రాస్తారోకో లో పాల్గొన్న సిఐటియు  ఏఐటీయూసీ నాయకులతో పాటు 13మందిని అరెస్టు చేసి 2వ పట్టణ పోలీసు స్టేషనుకు తరలించారు.

Related Posts