అయోధ్య
అయోధ్య రామ మందిరం ఆలయ నిర్మాణానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయం వెయ్యేళ్ల పాటు నిలిచి ఉండేలా నిర్మాణం చేపట్టారు. ఇసుక నేల అయినా భూకంపాలను తట్టుకొని నిలబడే విధంగా అన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు. సాధారణంగా నేటి కాలంలో ఆలయంలో సిమెంట్, ఉక్కు వాడడం సహజం. కానీ అయోధ్య ఆలయ నిర్మాణంలో మాత్రం ఎక్కడా ఇనుమును వాడకుండా జాగ్రత్తపడ్డారు. ఈ మందిరం నిర్మాణానికి మొత్తం నాపరాయి, పటిష్టమైన రాతినే ఉపయోగించారు. ఈ రాళ్లను వరుస క్రమంలో పేర్చి నిర్మించారు.ఇంతటి గొప్ప కట్టడాన్ని సందర్శించేందుకు ఇక్కడి ప్రభుత్వం మంగళవారం నుంచి సాధారణ భక్తులను అనుమతి ఇవ్వనుంది. కానీ ఇంతలోనే ఆలయం లోపలి దృశ్యాలు బయటకు వచ్చేశాయి. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. పూలతో అలంకరించారు. అక్కడక్కడా ఓంకారం, స్వస్తిక్ గుర్తులను పూలతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి ఈ ఆలయంలోపలి దృశ్యాలను వీడితో తీశారు.ఈ వీడియోలో ఆలయంలోపలి దృశ్యాలు రమణీయంగా కనిపిస్తున్నాయి. ఆలయ స్తంభాలను చూస్తే పురాతన కాలంలోకి వెళ్లినట్లు అనిపిస్తుంది. ఈ వీడియోను చూసిన వారు అయోధ్యకు వెళ్లకుండా రామ మందిరం చూశామన్న తృప్తి కలిగిందని కొందరు కామెంట్లు చేయడం విశేషం