YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎస్.ఈ.బి.దాడుల్లో భారీగా మద్యం పట్టివేత

ఎస్.ఈ.బి.దాడుల్లో భారీగా మద్యం పట్టివేత

అనకాపల్లి
అనకాపల్లి మిరియాల కాలనీ ఓ ఇంటిలో భారీగా  మద్యం  ఉన్నట్లుగా  సమాచారం రావడంతో ఎస్.ఈ.బి సీఐ అనిల్ కుమార్  తన సిబ్బంది తో కలిసి దాడులు నిర్వహించారు. వార్డు సచివాలయ పోలీస్, వాలంటరీ సమక్షంలో తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడ భారీగా మద్యం బాటిల్స్ ను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు మూడు లక్షలు ఉంటుందని ఎస్.ఇ.బి అధికారులు అంచనా వేసారు. మద్యం నిల్వ ఉంచిన ఇల్లు ఎవరిది,  మద్యానికి సంబంధించిన వ్యక్తుల గురించి అరా తీస్తున్నారు.

Related Posts