YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కొనసాగుతున్న ఇంజనీరింగ్ కౌన్సెలింగ్

కొనసాగుతున్న ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
రాష్ట్రవ్యాప్తంగా రానున్న విద్యా సంవత్సరానికి వివిధ ప్రైవేటు కళాశాలల్లో 2,726 ఇంజనీరింగ్ సీట్లు తగ్గాయి. గత ఏడాది 212 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో మొ త్తం 97,961 సీట్లు అందుబాటులో ఉండగా, ఈ సారి 198 కళాశాలల్లో 95,235 సీట్లకు ఆ యా యూనివర్శిటీలు అనుమతులు మంజూరుచేశా యి. ఇంజనీరింగ్‌లో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కళాశాలలు నడిపే పరిస్థితి లేకపోవడంతో కళాశాలలు స్వచ్చందంగా మూసివేసుకుంటున్నాయి. జెఎన్‌టియుహెచ్ పరిధిలో 14 కళాశాలల యాజమాన్యాలు తాము కళాశాలలు నడపలేమంటూ మూసివేతకు దరఖాస్తు చేసుకున్నాయి. అందుకు వర్సిటీ అనుమతించడంతో ఈ ఏడాది 14 కళాశాలలు తగ్గాయి.ఈసారి జెఎన్‌టియుహెచ్ కింద 169 ప్రైవేట్ ఇంజనీరింగ్  కళాశాలల్లో 84,124 సీట్లు అందుబాటులో ఉండగా, ఉస్మానియా వర్సిటీ పరిధిలో 11 కళాశాలల్లో 6,260 సీట్లు, కాకతీ య వర్సిటీ పరిధిలో 4 కళాశాలల్లో 1,800 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మూడు వర్శిటీల పరిధిలో 184 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో 92, 184 సీట్లు ఉన్నాయి. వీటితో పాటు 14 యూనివర్సిటీ కళాశాలల్లో 3,035 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 30 శాతం సీట్లు ‘ఎ’ కేటగిరీ కింద కన్వీనర్ కోటాలో భర్తీ కానుండగా, 30 శాతం యాజమాన్య కోటా కింద ఆయా కళాశాలలు భర్తీ చేసుకుంటాయి.ఎంసెట్ (ఎంపిసి) అభ్యర్థులకు  
సోమవారం నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభమైంది. 1వ ర్యాంకు నుంచి 10 వేల ర్యాంకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. అలాగే ఎన్‌సిసికి చెందిన స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు మాసాబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక భవన్‌లో 1వ ర్యాంకు నుంచి 40 వేల ర్యాంకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.

Related Posts