విజయవాడ
షర్మిల రాష్ట్ర రాజకీయాల్లోకి సంక్రాంతికి వచ్చి వెళ్ళే మాదిరి వచ్చారని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. శనివారం ఆంధ్రప్రదేశ్ పురావస్తు మరియు ప్రదర్శన శాలల శాఖ వారి ఆద్వర్యంలో పింగళి వెంకయ్య గ్యాలరీ బాపు మ్యూజియం లో లైట్ షో ప్రారంభోత్సవానికి మంత్రిరోజా ముఖ్య అతిధిగా హజరయ్యారు.
రోజా మాట్లాడుతూ
స్ధానికత లేని పార్టీలను ప్రజలు నమ్మరు. పక్క రాష్ట్రంలో పార్టీ తీసేసి, ఇక్కడికొచ్చి మాట్లాడితారు. జగనన్న కు ఇక్కడ అడ్రస్, గుర్తింపు, ఓటు అన్నీ ఉన్నాయి. వైఎస్ఆర్ అభిమానులంతా జగన్ వెంటే ఉన్నారు ఉంటారు. షర్మిల లాంటివారిని రాష్ట్ర ప్రజలు ఆదరించరు. తెలంగాణ ప్రజలు ఛీ కొడితే ఏపీ లోకి షర్మిల వచ్చారు. సామాజిక న్యాయానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేస్తున్నారు. జగన్ పాలనపై రాష్ట్ర ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని అన్నారు.
గతంలో ఎప్పుడూ లేని అభివృద్ధి రాష్ట్రంలో కనిపిస్తుంది. విజయవాడ నగరంలో అంబేద్కర్ భారీ విగ్రహం, బాపూ మ్యూజియం, భవాని ఐలాండ్ వంటి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేశాం. 2024 ఎన్నికల్లో జగన్ గెలుపు ఎవరూ ఆపలేరు. నాన్ లోకల్ పొలిటిషియన్స్ ఇక్కడ ఉండరు.. పట్టించుకోరు. రాజన్న బిడ్డగా ప్రజలకు రాజన్న రాజ్యం అందించడానికి జగన్ కాంప్రమైజ్ కాలేదు. ఏపీలో ఒటడిగే నైతిక అర్హత కాంగ్రెస్ కి లేదని అన్నారు.
రాష్ట్రాన్ని విడగొట్టి, వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్ లో పెట్టింది కాంగ్రెస్. ప్రత్యేక హోదా ప్రకటించకుండా ఒక రూంలో కూచుని రాష్ట్రాన్ని విడగొట్టారు. కాంగ్రెస్ తరఫున ఎవరొచ్చిన పిచ్చోళ్ళవుతారు. వాగే నోర్లకి 2024 సమాధానం చెపుతుందని ఆమె అన్నారు.