YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

స్పీడ్ పెంచిన వైకాపా ఎమ్మెల్సీ బద్వేల్ మాజీ ఎమ్మెల్యే డిసి గోవింద్ రెడ్డి

 స్పీడ్ పెంచిన వైకాపా ఎమ్మెల్సీ బద్వేల్ మాజీ ఎమ్మెల్యే డిసి గోవింద్ రెడ్డి

బద్వేలు
బద్వేలు మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి వేగం పెంచారు. నాయకులను కార్యకర్తలను గత కొద్ది రోజులుగా ఉత్తేజ పరుస్తున్నారు పార్టీ విజయమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. బద్వేల్ అసెంబ్లీ నియోజవర్గంలో మరోసారి వైఎస్ఆర్సిపి జెండా ఎగురువేయడం ఖాయమని ఆయన అంటున్నారు. నాయకులను కార్యకర్తలను ఎప్పటికప్పుడు సమన్వయ పరుస్తూ వారిలో ఉత్తేజం నింపుతున్నారు. సౌమ్యుడైన ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి వైకాపా రాజకీయాల్లో ఆ పార్టీ పుట్టినప్పుడు నుండి బద్వేలు అసెంబ్లీలో గోవింద్ రెడ్డి కీలక నేతగా ఉన్నారు. బద్వేల్ అసెంబ్లీ రిజర్వు కాకముందు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గోవింద్ రెడ్డినీ రాజకీయాల్లోకి తీసుకువచ్చారు అప్పట్లో గోవింద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు రాజశేఖర్ రెడ్డి మృతి చెందిన తర్వాత ఆయన కుమారుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి బద్వేల్ అసెంబ్లీలో కీలక నేతగా ఉన్నారు. గోవింద్ రెడ్డి మాటకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడలేని విలువిస్తారు. అసెంబ్లీ రిజర్వ్ అయిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా అప్పటి ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్ రెడ్డి గోవింద్ రెడ్డి చెప్పిన కమలమ్మకు పార్టీ టికెట్ ఇచ్చారు. ఆమెను గోవింద్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించారు. ఆ తరువాత పులివెందుల మున్సిపల్ కమిషనర్ గా ఉన్న జయరాములు వైయస్సార్ సిపి అభ్యర్థిగా బద్వేల్ నుంచి పోటీ చేయించి మంచి మెజార్టీతో గెలిపించారు. ఆ తర్వాత డాక్టర్ వెంకటసుబ్బయ్యకు పార్టీ టికెట్ ఇప్పించి ఆయన కూడా గెలిపించారు. డాక్టర్ వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఆ తర్వాత జరిగిన బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధా కు వైకాపా టికెట్ ఇప్పించి లక్ష
పైగా మెజార్టీతో గెలిపించారు. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తన సత్తా చాటాలని గోవింద్ రెడ్డి భావిస్తున్నారు. గోవింద్ రెడ్డి ప్రతిపాదించిన వారికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తారని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. పార్టీ టికెట్ విషయంలో ఎలాంటి వివాదాలు లేకపోయినప్పటికీ గోవింద్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవర్ని ప్రతిపాదిస్తారు అనే విషయం ఇప్పటికీ స్పష్టం కావడం లేదు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సుధాకు మరోసారి పార్టీ టికెట్ వస్తుందని వైకాపా నాయకులు కార్యకర్తలు బలంగా చెబుతున్నారు. కానీ ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి తన మనసులో మాట ఇంతవరకు బయట పెట్టడం లేదు. కాగా నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో వైకాపా బలంగా ఉందని చెప్పాలి. ప్రత్యర్థి పార్టీ కూడా బలంగా ఉండడంతో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు బద్వేల్ అసెంబ్లీలో రసవత్తరంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా బద్వేలు అసెంబ్లీలో తెలుగుదేశం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య పోరు తీవ్రంగా ఉంటుందని పరిశీలకులు ఇప్పటినుంచి భావిస్తున్నారు.

Related Posts