YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాజ్యసభ ఎన్నికలకు రెడీ

రాజ్యసభ ఎన్నికలకు రెడీ

న్యూఢిల్లీ, జనవరి 29
రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యుల ఎంపికకు షెడ్యూల్ విడుదల చేశారు. ఫిబ్రవరి 8న ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లు సమర్పించేందుకు ఫిబ్రవరి 15న చివరి గడువుగా కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. యూపీలో అత్యధికంగా 10 మంది సభ్యులను ఎన్నుకోనున్నారు. ఆ తరవాత బిహార్, మహారాష్ట్రలో ఆరుగురు చొప్పున సభ్యుల ఎన్నిక జరగనుంది. ఇక పశ్చిమబెంగాల్‌లో ఐదుగురు, మధ్యప్రదేశ్‌లో ఐదుగురు, కర్ణాటకలో నలుగురు సభ్యులను ఈ ఎన్నికల ద్వారా ఎన్నుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, రాజస్థాన్‌లో మూడు సీట్లున్నాయి. ఛత్తీస్‌గఢ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఒక్కో సీట్‌కి ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 16వ తేదీన నామినేషన్లు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 20 చివరి తేదీగా ఎన్నికల సంఘం వెల్లడించింది. ఫిబ్రవరి 27న సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ప్రక్రియ మొదలవుతుంది.
ముఖ్యమైన తేదీలివే..
ఎన్నికల నోటిఫికేషన్ - ఫిబ్రవరి 8
నామినేషన్లకు ఆఖరి తేదీ - ఫిబ్రవరి 15
నామినేషన్ల పరిశీలన - ఫిబ్రవరి 16
నామినేషన్ల ఉపసంహరణకి చివరి తేదీ - ఫిబ్రవరి 20
పోలింగ్ వివరాలు..
పోలింగ్:  ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్
 కౌంటింగ్: ఫిబ్రవరి 27న సాయంత్రం 5 గంటలకు
రాజ్యసభ సభ్యుల్ని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. బ్యాలెట్ పేపర్ విధానంలో ఈ ఎన్నిక జరుగుతుంది. బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థుల వివరాలుంటాయి. ఆ పేర్లలో తనకు నచ్చిన పేరుని మార్క్ చేసి బాక్స్‌లో వేస్తారు ఎమ్మెల్యేలు. తొలిరౌండ్‌లో అవసరమైన మెజార్టీ సాధించిన వ్యక్తి గెలిచినట్టుగా ప్రకటిస్తారు. అందరికన్నా తక్కువ ఓట్లు వచ్చిన వాళ్లను తొలగిస్తారు. ఆ ఓట్లను ఎమ్మెల్యేల నిర్ణయం ప్రకారం మిగతా అభ్యర్థులకు బదిలీ చేస్తారు. అన్ని వేకెన్సీలు భర్తీ అయ్యేంత వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

Related Posts