YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మేడ్చల్ మెట్రో పనులు వెంటనే ప్రారంభించండి మహా ప్రబో!

మేడ్చల్ మెట్రో పనులు  వెంటనే ప్రారంభించండి మహా  ప్రబో!
నిన్న మొన్న పురుడు పోసుకున్న హైకోర్టు నిర్మాణ స్థలానికి పరుగు పరుగున మెట్రో వేస్తాం అంటున్నారు. విమానాశ్రయం పేరు చెప్పి అవసరం లేకున్నా పాత నగరంలో *రెండేసి మార్గాల నుండి లైన్లు వేస్తున్నారు*. రెండవ దశ విస్తరణ  లో గత ప్రభుత్వము ఉత్తర ప్రాంతానికి ప్రాతినిధ్యం కల్పించలేదు, ఈ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వ ప్రణాళికను రద్దు చేస్తూ కొత్త ప్రణాళికను తయారు చేస్తుందంటే మా *కొంపెల్లి, బోయినపల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, అల్వాల్ , షామీర్పేట్, బొల్లారం* ప్రాంత ప్రజలము గంపెడు ఆశలు పెట్టుకున్నాము కానీ మమ్మల్ని అందరినీ నిరాశ పరుస్తూ మాకు మీటరు మెట్రో ఇవ్వకుండా మొండి చేయి చూపారు. *ఇది తీరని అన్యాయంగా మరియు అవమానంగా ఈ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు.* మాకు తెలుసు మీరు ఇప్పుడు ప్రారంభిస్తేనే అది పూర్తి కావడానికి 5, 10 సంవత్సరాలు పడుతుంది కానీ మీరు ఐదు సంవత్సరాల తర్వాత ప్రారంభిస్తామంటే *బహుశా మాతరం మా ప్రాంతంలో మెట్రో కూతలు వినకుండానే వెళ్ళిపోతుంది*. ఇది రాష్ట్ర ఖజానాకి 80 శాతం నిధులు అందించే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రాంత పరిస్థితి. వేలాది కోట్ల విలువైన మా ఔటర్ రింగ్ రోడ్డును రాత్రికి రాత్రి అమ్మేసి ఆ డబ్బులు ఇతర ప్రాంతాల్లో పంచి పెడతారు కానీ మా ప్రాంతంలోని జీడిమెట్ల సుభాష్ నగర్ ప్రాంతంలో ఎద్దుల బండి కూడా పట్టని బ్రిడ్జి పై నుండి వేలాది వాహనాలు ఏండ్ల కొద్ది ప్రయాణిస్తు నరకం అనుభవిస్తుంటే మీ దృష్టికి రాదు కొబ్బరికాయ కొట్టి రెండు సంవత్సరాలు అయినా *మా ఐటీ టవర్లలో తట్టెడు మట్టి తీయలేదు* కానీ దీనితోపాటు శంకుస్థాపన చేసుకున్న జిల్లాలలోని టవర్లలో వ్యాపారకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతంలో అతి గతి లేని రైల్వే ఓవర్ బ్రిడ్జిలు మా సహనాన్ని పరీక్షిస్తూ మమ్మల్ని వెక్కిరిస్తున్నాయి . జీడిమెట్ల కాలుష్యంతో పాటు అడపాదడపా వరదల్లో డ్రైనేజీల్లో కొట్టుకుపోతూ మా చిన్నారులు చేస్తున్న  ఆర్తనాధాలు మా గుండెను చెరువు చేస్తున్నాయి  వీటన్నిటికీ అధనం నగరమంతా ఊడ్చి మా ప్రాంతంలో నిలువ చేస్తున్న ఆ డంపింగ్ యార్డ్. *ఎందుకో పాలకులకి ఈ ప్రాంతంపై ఇంతటి నిర్లక్ష్యం* రాష్ట్ర ఖజానాకి సిరులను కురిపిస్తున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఈ ప్రాంతం *మీ కాళ్లు మొక్కుతా బాంచని వేడుకుంటుంది* ప్రతిపాదిత రెండవ దశ మెట్రో లైనులో అనవసరంగా వేస్తున్న లైన్లను తీసి మా మేడ్చల్, కొంపల్లి, బోయిన్పల్లి, అల్వాల్ ,బొల్లారం, తూముకుంట ప్రాంతాలకు మెట్రో లైన్ పనులు వెంటనే ప్రారంభించాలని  కోరుకుంటుంది
ఎం సంపత్ రెడ్డి
మెట్రో మేడ్చల్ మెట్రో సాధన సమితి

Related Posts