YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జీవో 59 రీ_ వెరిఫికేషన్...

జీవో 59 రీ_ వెరిఫికేషన్...

హైదరాబాద్, జనవరి 30,
జీవో 59.. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి తీసుకొచ్చింది. ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే క్రమబద్ధీకరించేందుకు ఈ జీవోను తీసుకొచ్చామని అప్పటి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులతో ఈ జీవో పై విస్తృతంగా ప్రచారం చేయించారు. అయితే ఈ జీవోలో ఉన్న లొసుగుల ఆధారంగా చాలామంది ప్రభుత్వ భూములను అక్రమంగా క్రమబద్ధీకరించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అలా భూములను క్రమబద్ధీకరించుకున్న వారిలో నూటికి 99 శాతం భారత రాష్ట్ర సమితి నాయకులే ఉన్నారని విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో 59 కి సంబంధించి రోజుకొక సంచలనమైన అంశం తెరపైకి వస్తోంది. అంతేకాదు నిషేధ జాబితాలో ఉన్న భూములను భారత రాష్ట్ర సమితి నాయకులు జీవో 59 పేరుతో క్రమబద్ధీకరించుకున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా క్రమబద్ధీకరించిన భూముల వ్యవహారంపై రేవంత్ దృష్టి సారించారు. కెసిఆర్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన జీవో 59 ని రీ_ వెరిఫికేషన్ చేయాలని నిర్ణయించారు.గత భారత రాష్ట్ర సమితి హయాంలో జీవో 59 ని తెరపైకి తీసుకువచ్చింది. ప్రభుత్వ భూములలో దశాబ్దాల నుంచి ఇల్లు కట్టుకొని ఉంటున్న వారికి ఆ స్థలాలను క్రమబద్ధీకరణ చేసేందుకు జీవో 59 తీసుకొచ్చింది. ఆ భూముల్లో నివాసం ఉంటున్న వారి నుంచి క్రమబద్ధీకరణ పేరుతో కొంత ఫీజు వసూలు చేసింది. ఆ స్థలాన్ని వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసింది. అయితే ఇందులో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగాయనే ఆరోపణలున్నాయి. ఇలాంటి నిర్మాణాలు లేని ప్రభుత్వ భూముల్లో ఎప్పటినుంచో నిర్మాణాలు ఉన్నట్టు చూపించి ఎకరాల కొద్దీ భూములను తమ పేరుతో భారత రాష్ట్ర సమితి నాయకులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ప్రభుత్వం గుర్తించింది. పూర్తిగా పరిష్కారమైన, క్రమబద్ధీకరించి రిజిస్ట్రేషన్లు కూడా చేసిన దస్త్రాలను మళ్లీ పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఫీజులు చెల్లించి ఇంకా రిజిస్ట్రేషన్ కాని దరఖాస్తులు ఉంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపివేయాలని అధికారులను ఆదేశించింది. క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకొని, జీవోలో నిర్దేశించిన మేరకు ఫీజులు చెల్లించినప్పటికీ కొన్ని స్థలాలకు ఇంకా రిజిస్ట్రేషన్ చేసి కన్వెన్షన్ డీడ్ ఇవ్వడం పూర్తి ఆకపోవడంతో కాకపోవడంతో.. ఇలాంటి ఫైల్స్ ఎక్కడికక్కడే నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాప్తంగా ఇలాంటి ఫైల్స్ 1000 వరకు ఉన్నట్లు సమాచారం. అయితే వీటి విలువ కోట్లల్లో ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జీవో 59 కింద క్రమబద్దీకరణ చేసిన ఫైళ్లల్లో ఎక్కువ శాతం రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి, సంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. క్రమబద్ధీకరణ పేరుతో ఇక్కడ భారీ ఎత్తున ప్రభుత్వ భూములను అధికార పార్టీకి చెందిన నాయకులు కొల్లగొట్టారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయా జిల్లాల పరిధిలో 59 జీవో కింద చేసిన భూ రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ స్థలాలలో నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులు ఇవ్వద్దని ఆయా శాఖలకు చెందిన అధికారులను ఆదేశించింది..అయితే ప్రభుత్వం రీ_ వెరిఫికేషన్ కోసం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో న్యాయపరంగా వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నాయని తెలుస్తోంది. క్రమబద్ధీకరణ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కన్వెయన్స్ డీడ్ లోనే దీనిపై ప్రభుత్వం భవిష్యత్తులో ఎలాంటి వివాదాన్ని తీసుకురాదు అనే షరతు ఉంటుంది. దీంతో ఇప్పుడు రీ వెరిఫికేషన్ లో ఎక్కడైనా అక్రమాలు జరిగినట్టు తేలితే.. వాటిని రద్దు చేయాలని నిర్ణయిస్తే.. లబ్ధిదారులు న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇక్కడ దరఖాస్తుదారు సమర్పించిన సమాచారం లో ఏవైనా తప్పులు, అక్రమాలు ఉంటే వాటి ప్రాతిపదికన క్రమబద్ధీకరణను తిరస్కరించే అవకాశం ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటుంది. ఇచ్చిన సమాచారం మొత్తం సరైనదే అనే డిక్లరేషన్ ను కూడా ప్రభుత్వం ముందే తీసుకుంటుంది. నిర్మాణాలు లేని చోట్ల ఉన్నట్లు చూపించడం అక్రమం అయినందువల్ల.. ఈ అంశం ప్రాతిపదికగానే రద్దు చేస్తున్నట్టు న్యాయస్థానంలోనూ చెప్పడానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. తప్పుడు దరఖాస్తులు సమర్పించిన వారిపై న్యాయపరంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులపై కూడా యాక్షన్ తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. సో మొత్తానికి కెసిఆర్ హయాంలో తీసుకొచ్చిన జీవో 59 పై రేవంత్ రీ_ వెరిఫికేషన్ అస్త్రం మునుముందు రోజుల్లో మరిన్ని సంచలనాలకు దారి తీసే అవకాశం లేకపోలేదనడంలో ఎటువంటి సందేహం లేదు.

Related Posts