YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కళ్లు తిరిగేంత ఆస్తులతో శివ బాలకృష్ణ

 కళ్లు తిరిగేంత ఆస్తులతో  శివ బాలకృష్ణ

హైదరాబాద్, జనవరి 30,
హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసుకు సంబంధించి ఏసీబీ సోదాలు నిర్వహించింది. 2 రోజుల క్రితం పలు బృందాలుగా విడిపోయి మొత్తం 18చోట్ల తనిఖీ నిర్వహించారు. శివ బాలకృష్ణ విచారణకు ఏమాత్రం సహకరించలేదని మొదటి నుంచి చెప్పడమే కాకుండా రిమాండ్ రిపోర్టులో ఏసీబీ పేర్కొంది. దీనికి సంబంధించిన 45 పేజీలతో రిమాండ్ రిపోర్టు బయటకు వచ్చింది. 1994లో గ్రూప్1 క్యాడర్‌తో సర్వీస్‌లోకి వచ్చిన శివ బాలకృష్ణ.. అనంతపురం, గుంటూరు, వైజాగ్, జీహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖల్లో కీలక పదవులు చేపట్టారు. 2021 నుండి 2023 వరకు హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌గా బాలకృష్ణ విధులు నిర్వహించారు.రిమాండ్ రిపోర్ట్‎లో శివ బాలకృష్ణ ఇల్లు సహా 18చోట్ల జరిగిన ఏసీబీ సోదాల్లో భారీగా ఆస్తుల గుర్తించామని, 50 ప్రాపర్టీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు అధికారులు. 4.9కోట్లు స్థిరాస్తులు, 8.2 కోట్ల చరాస్తులతో పాటు డాక్యుమెంట్ల ప్రకారం 10 కోట్ల ఆస్తివిలువ ఉంటుందని వెల్లడించారు. బహిరంగ మార్కెట్‌లో దాని విలువ 10రెట్లు ఎక్కువగా ఉంటుందని ఏసీబీ భావించింది. పుప్పాలగూడ ఆదిత్య ఫోర్ట్ వ్యూలో విల్లా హౌజ్, సోమాజిగూడ లెజెండ్ తులిప్స్‌లో ఫ్లాట్, శేరిలింగంపల్లిలో అధితలో ఫ్లాట్, మల్కాజిగిరి, చేవెళ్లలో ప్లాట్స్ ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. సోదాలు నిర్వహించిన సమయంలో బాలకృష్ణ ఇంట్లోని బెడ్ రూంలో పలు బ్రాండెడ్ కంపెనీలకు చెందిన వాచ్‎లు గుర్తించారు. వివిధ ప్రముఖ బ్రాండ్ల ఖరీదైన వాచ్‎లని భద్రంగా దాచుకున్నట్లు వివరించారు. ఇంట్లో సొదాల సందర్భంగా. మొత్తం 32 లక్షల రూపాయల విలువ చేసే వాచ్‎లు ఉన్నట్టు గుర్తించారు. అన్ని కంపెనీలకు సంబంధించి మొత్తం 120 వాచ్‎లను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. నాగర్ కర్నూల్‌ జిల్లాలో 12.13 ఎకరాలు, చేవెళ్ల, అబ్దుల్లాపూర్, భువనగిరి, యాదాద్రి, జనగాం, సిద్దిపేట, గజ్వేల్, భూములు, ప్లాట్స్ ఉన్నాయని, 99లక్షల నగదు, నాలుగు కార్ల విలువ 51లక్షలు రూపాయలు, బ్యాంకు బాలెన్స్ 58 లక్షలు ఉన్నాయని తెలిపింది. HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వద్ద బంగారు ఆభరణాలతో పాటు సిల్వర్, వాచ్‌లు, ఫోన్స్, గృహోపకరణాలు మొత్తం వాల్యూ 8కోట్ల 26లక్షలు రూపాయలు ఉంటుందని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. రొలెక్స్, రాడో, ఫాసిల్, టిసాట్ బ్రాండెట్ 120 హ్యాండ్ వాచ్‌లు స్వాధీనం చేసుకుని వాటి విలువ 32లక్షలు ఉంటుందని అంచనావేసింది. ఇవే కాకుండా ఆపిల్ ఫోన్స్, ట్యాబ్స్ స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 15 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. పలు ఇన్ఫ్రా డెవలపర్ కంపెనీలపై కూడా ఏసీబీ సోదాలు చేశామని తెలిపింది. హెచ్‌ఎండీఏలో పనిచేసిన సమయంలో కొన్ని ప్రముఖ ఇన్‌ఫ్రా కంపెనీలకు అనుమతులు మంజూరి చేసి కోట్ల రూపాయలు గడించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కొంత డబ్బును కూడా ఇన్‌ఫ్రా కంపెనీల్లో పెట్టుబడి పెట్టినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. బినామీ పేర్లపై ఆస్తులను కూడబెట్టారని తెలుసుకున్న అధికారులు ఇప్పటి వరకు అతని స్నేహితులు, బంధువులు, తెలిసిన వాళ్లకు సంబంధించి మొత్తం 34మందిపై ఉన్న ఆస్తుల వివరాలు రిమాండ్ రిపోర్ట్‌లో  పొందుపరిచారు. వీటన్నింటిని పరిశీలించి బినామీ ఆస్తులు అని తేలితే జప్తు చేసే అవకాశం ఉంది. మొత్తానికి తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంలో అరెస్ట్‌ అయిన హెచ్‌ఎండీఏ  మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమ ఆస్తుల చిట్టా లెక్కతేల్చేందుకు రంగం సిద్ధం చేసింది ఏసీబీ. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో శివబాలకృష్ణ రిమాండులో ఉన్నారు. శివబాలకృష్ణకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అయితే బాలకృష్ణను 10 రోజుల పాటు కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని అక్రమ ఆస్తుల విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. మరికొన్ని కీలక అరెస్ట్‎లు జరిగే అవకాశం ఉంది.

Related Posts