YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వచ్చే ఐదేళ్లు అభివృద్ధికి స్వర్ణయుగం

వచ్చే ఐదేళ్లు అభివృద్ధికి స్వర్ణయుగం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1
నిర్మలమ్మ బడ్జెట్ లో ఆదాయపన్ను వర్గాలకు ఊరట లభించలేదు.. పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులేదని బడ్జెట్ లో ప్రకటించారు. రూ.7లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఎలాంటి పన్నులేదని నిర్మలా సీతారామన్ తెలిపారు. టూరిస్ట్ హబ్గా లక్షద్వీప్. యువతకు ముద్ర యోజన ద్వారా రూ.25 లక్షల కోట్ల రుణాలిచ్చాం..30 కోట్ల మంది మహిళలకు ముద్ర రుణాలు అందించాం. లక్ష కోట్లతో ప్రైవేట్ సెక్టార్కి కార్పస్ ఫండ్,  517 ప్రాంతాలకు కొత్త విమాన సర్వీసులు,  3 మేజర్ రైల్వే కారిడార్లు నిర్మాణం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు...
సరికొత్త రోడ్ మ్యాప్తో వికసిత్ భారత్..  పెట్టుబడులు పెరిగాయి, విదేశీ పెట్టుబడులకు ఇది స్వర్ణయుగమన్నారు.
ఎఫ్డిఐ కొత్త నిర్వచనం నిర్మలా సీతారామన్ చెప్పారు. ఎఫ్డీఐ అంటే ఫస్ట్ డెవలప్ ఇండియా. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో రాష్ట్రాలకు తోడ్పాడు అందిస్తాం. 7 లక్షల వరకు ఎలాంటి పన్నులేదని అన్నారు. కొత్త ట్యాక్స్ విధానం కింద ఏడాదికి రూ. 7 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్నులేదు. సంస్కరణలు అమలు చేయడానికి రాష్ట్రాలకు 50 ఏళ్లపాటు రూ.75 వేల కోట్ల వడ్డీలేని రుణాలు. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మూడురెట్లు పెరిగాయి. ప్రత్యక్ష, పరోక్ష పన్నులు, దిగుమతి సుంకాల్లో ఎలాంటి మార్పులేదు. ఆదాయపు పన్ను రిటర్న్లు సమర్పించిన వారికి రీ ఫండ్స్ను వేగవంతం చేస్తున్నాం. జీఎస్టీ విధానం ప్రయోజనకరంగా ఉందని 94 శాతం పారిశ్రామిక ప్రముఖులు చెప్పారు. ట్యాక్స్ పేయర్ల సొమ్ము దేశాభివృద్ధికి వినియోగిస్తున్నాం. మూడు రైల్వే కారిడార్లను అభివృద్ధి చేస్తాం. ఉడాన్ పథకంలో 517 రూట్లలో కోటి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నామని అన్నారు. మూడు రైల్వే కారిడార్లను అభివృద్ధి చేస్తాం. 40వేల నార్మల్ బోగీలను వందేభారత్ ప్రమాణాలకు పెంచుతామని అన్నారు.
ఇంధనం, సిమెంట్, ఖనిజాల కారిడార్ను, పోర్టు కనెక్టివిటీ కారిడార్ను అభివృద్ధి చేస్తాం. మౌలిక వసతుల రంగం 11.1 శాతం వృద్ధితో రూ.11 లక్షల 11వేల 111 కోట్ల కేటాయించాం. రూ. లక్ష కోట్ల నిధిని ఏర్పాటు చేస్తాం. పరిశోధన, సృజనాత్మకకు రూ. లక్ష కోట్ల నిధిని ఏర్పాటు చేస్తాం. మధ్యతరగతి ప్రజల ఇంటి నిర్మాణాలకు, కొనుగోలు మద్దతు ఇస్తాం. స్వయం సహాయక బృందాల కోటి మంది మహిళలు లక్షాధికారులు అయ్యారు. లక్ పతీ దీదీ టార్గెట్ను రెండు కోట్ల నుంచి మూడు కోట్లకు పెంచుతున్నాం. ఐదు సమీకృత ఆక్వా పార్కులను ఏర్పాటు చేస్తాం. రాష్ట్రాలతో కలసి పనిచేస్తున్నాం. జిల్లాలు, బ్లాక్ల అభివృద్ధి కోసం రాష్ట్రాలతో కలసి పనిచేస్తున్నాం. సమ్మిళిత, సుస్థిరాభివృద్ధి కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాం. మనం ప్రారంభించిన యూరప్ కారిడార్ ప్రపంచ వాణిజ్యానికి కీలకం కాబోతున్నాయి. వచ్చే ఐదేళ్లలో పీఎం ఆవాస్ యోజన కింద రెండు కోట్ల ఇళ్లనిర్మాణం. అంగన్వాడీ కార్మికులు, హెల్పర్లకు ఆయుష్మాన్ భారత్ కవరేజ్ ఇస్తున్నాం. 9-18 ఏళ్ల బాలికలు సర్వైకల్ కేన్సర్ పడకుండా చర్యలు తీసుకుంటాం. మరిన్ని మెడికల్ కాలేజీల కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. రూఫ్ టాప్ సోలార్ పాలసీ విధానం కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్. మధ్యతరగతి కోసం ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తాం. వచ్చే ఐదేళ్లలో పీఎం ఆవాస్ యోజన కింద రెండు కోట్ల ఇళ్లనిర్మాణం.
రైతుల సమగ్రాభివృద్ధి కోసం చర్యలు
డెయిరీ రైతుల సమగ్రాభివృద్ధి కోసం చర్యలు చేపడుతున్నాం. ఆయిల్ సీడ్స్ రంగంలో ఆత్మనిర్భరత సాధిస్తాం. నానో యూరియా తర్వాత పంటలకు నానో డీఎపి  కింద ఎరువులు అందిస్తాం. వచ్చే ఐదేళ్లు అభివృద్ధికి స్వర్ణయుగం కాబోతున్నాయని అన్నారు.
ప్రపంచదేశాలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా, భారత్ మాత్రం వీటికి అతీతంగా అభివృద్ధి సాధిస్తోంది.  కరోనా తర్వాత యుద్ధాలు, సంక్షోభాలతో సప్లయ్-చైన్ మేనేజ్మెంట్ దెబ్బతిన్నది. మౌలిక వసతులను రికార్డుస్థాయిలో చేపడుతున్నాం. దేశంలోని అన్నిప్రాంతాల్లో ఆర్థికవృద్ధిలో కనిపిస్తోంది. ప్రజల ఆదాయం 50 శాతం పెరిగింది. అన్నిరంగాల్లో ఆర్థికవృద్ధిని సాధిస్తున్నాం. ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధంగా ప్రకటించాం. మహిళలకు మూడింట ఒకవంతు రిజర్వేషన్లు కల్పించాం. మహిళలకు 30 కోట్ల ముద్రా రుణాలను ఇచ్చాం. దేశంలో ఇప్పుడు 80 మంది చెస్ గ్రాండ్ మాస్టర్లు ఉన్నారు. క్రీడల్లో సాధించిన పతకాలు యువత ఆత్మస్థైర్యాన్ని చాటుతున్నాయి. స్టార్టప్ ఇండియా, స్టార్టప్ క్రెడిట్ గ్యారంటీ వల్ల యువత ఉద్యోగాలు కల్పిస్తోంది. మూడువేల ఐటిఐలను, 390 వర్సిటీలను ఏర్పాటు చేశాం. జాతీయ విద్యావిధానం ద్వారా యువతకు సాధికారత కల్పిస్తున్నాం. అన్నదాతల సంక్షేమం కోసం 11.8 కోట్లమందికి ఆర్థిక సాయం అందిస్తున్నాం. 4 కోట్ల మంది రైతులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నాం. 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్తో ఆహార సమస్య తీరిందని అన్నారు. గరీబ్, మహిళ, యువ, అన్నదాతల ఆశలు, ఆకాంక్షలు, సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు.  సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో పనిచేస్తున్నాం. కరోనా సంక్షోభం నుంచి ఈ దేశం అధిగమించింది. మా సమ్మిళిత వృద్ధి ఆలోచనావిధానం గ్రామస్థాయికి చేరి సక్సెస్ అయింది.  80 కోట్ల మందికి ఫ్రీ రేషన్తో ఆహార సమస్య తీరింది.  గ్రామీణ ప్రజల ఆర్థిక వికాసం సాధ్యం అవుతోందని ఆమె అన్నారు.

Related Posts