కుప్పం
కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలంలోని రాజుపేట మరియు వర్తికుప్పం ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్ పరిశీలించారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. వి.కోట జడ్పీ బంగ్లాలో 5వ తారీకున ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించునున్న హంద్రీనీవా జలాల ప్రాజెక్ట్ మ్యాప్ ను అధికారులు పరిశీలించారు. అనంతరం రామకుప్పం వెళ్లిన అధికారులు, వి.కోట, రామకుప్పం సరిహద్దులో ఉన్న హంద్రీ నీవా కాలువను పరిశీలించారు.