నెల్లూరు
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక అసువులు బాసిన బాధిత కుటుంబాలను నార భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో చంద్రబాబు అరెస్టు పై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలకు కలత చెంది భోజనము తీసుకోక అనారోగ్యం పాలై మృతి చెందిన తాటిపర్తి సుధాకర్ కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. బాధిత కుటుంబానికి మూడు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నారా భువనేశ్వరుని చూసేందుకు పెద్ద ఎత్తున మహిళలు కొమ్మి గ్రామానికి తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ,టిడిపి నాయకులు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.