విశాఖపట్నం
విశాఖపట్నం లో భారత్.. ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా తన సొంత గ్రౌండ్ విచ్చేసిన క్రికేటర్ భరత్ కు ఆంధ్రా క్రికెట్ అసోసీయేషన్ సన్మానం చేసింది.
ఏ సీ ఏ సెక్రెటరీ గోపినాథ్ రెడ్డి మాట్లాడారు. భరత్ తన సొంత ఊరు సొంత గ్రౌండ్ లో టెస్ట్ మ్యాచ్ అడనున్నాడు. 2012/13 రంజీ ట్రోఫీలో ఆడడం జరిగింది. రంజీ లలో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్, లక్నో,వంటి ఐపీఎల్ టీమ్ లలో ప్లేయర్. అంతర్జాతీయంగా పలు దేశాల లో మ్యాచ్ లు ఆడడం జరిగిందని అన్నారు.
విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ మాట్లాడుతూ భరత్ చాలా ప్రతిభా వంతుడైన ఆటగాడు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వాడు కావడం గర్వకారణం. ఎంతోమంది భావి తరాల క్రీడా కారులు ఆదర్శం, సూర్తి గా తీసుకుంటున్నారు. మన విశాఖ పట్నం కు చెందినవాడు కావడం మనకు గర్వకారణమని అన్నారు.
భరత్ మాట్లాడుతూ తన కెరీర్ పరంగా ఇంత మంచి అవకాశాలు వస్తున్నాయి అంటే ఏ సీ ఏ తనకు ఇచ్చిన ప్రోత్సాహం చాలా ఉంది. మన తెలుగు రాష్ర్టాలలో క్రికెట్ కు మంచి ఆదరణ ఉంది. అంతర్జాతీయ స్థాయి క్రీడా మైదానాలు ఉన్నాయి. తన సొంత గ్రౌండ్ లో ఆడడం చాల సంతోషం గా ఉంది. అంతర్జాతీయ క్రికెట్ క్రీడకారులు తయారవ్వడానికి ఏ సీ ఏ అందిస్తున్న సహకారం మరువ లేనిదని అన్నారు.