విశాఖపట్నం
విశాఖ సాగరతీరంలో క్రికెట్ సందడి మొద లైంది.భారత్- ఇంగ్లాండ్ లు మరో మూడు రోజుల్లో విశాఖ వేదికగా తలబడబోతున్నాయి. మళ్లీ చాలా రోజుల తర్వాత విశాఖలో జరుగుతు న్న క్రికెట్ మ్యాచ్ కావడంతో క్రికెట్ అభిమానులు సంబరపడు తున్నారు. తమకు ఇష్టమైన క్రికెటర్లను నేరుగా చూడవచ్చని ఆసక్తి గా ఎదురుచేస్తు న్నారు. భారత్- ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఫిబ్రవరి 2 న నుంచి రెండో టెస్టు మ్యాచ్ కి విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ- వీడీసీఏ అంత ర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరగ నుంది.ఈ నేపధ్యంలో ఇప్పటికే విశాఖలో వింనోవటల్ కి భారత్, ఇంగ్లాండ్ జట్లు చేరుకున్నాయి. రోజు కు 2 వేల మంది చొప్పున 5 రోజులకు 10 వేల మంది విద్యా ర్థులకు ఉచిత ఎంట్రీ ఇవ్వనున్న దృష్ట్యా వారి ఐడీ కార్డులను పరిశీలించి స్టేడియంలోకి పంపించనున్నా రు.మరోవైపుఅమీతుమీ తేల్చుకోవడానికి టీమ్ ఇండి యా, ఇంగ్లాండ్ జట్ల క్రికెటర్లు ముమ్మర సాధన చేస్తు న్నారు. పీఎంపాలెం ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడి యంలో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ భారత్ కు కీలకంగా మారింది. మొదటిమ్యాచ్లో ఓడిపోవడం, గాయాలతో కీలక ఆటగాళ్లు దూరం కావడంతో భారత జట్టు కఠిన సవాల్ ను ఎదుర్కొంటోంది. బ్యాటింగ్, బౌలింగ్, క్యాచ్లు పట్టడం తదితర విభాగాల్లో భారత్ క్రికెటర్ల సాధన జోరుగా సాగింది.