YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వచ్చే ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి బిజెపినే వైసీపీ లెక్కలోకి రాదు…అది కోమాలో ఉంది

వచ్చే ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి బిజెపినే         వైసీపీ లెక్కలోకి రాదు…అది కోమాలో ఉంది
మహానాడు వేదిక గా మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఉత్తరును ప్రగాల్బాలను గుర్తు చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి బిజెపినే అని ప్రకటించారు. అసలు వైసీపీ లెక్కే కాదు…అది కోమాలో ఉందని తేల్చారు. ఎవరైనా పోరాటానికి సమఉజ్జీని ఎంచుకుంటారు కాని లోకేష్ లెక్క అది…ఎవరు మాత్రం ఏమి చేయగలరు. కానీ టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం ఏపీలో బిజెపికి ఒక శాతానికి మించి ఓట్లు రావని అదే మహానాడు వేదికపై నుంచి వెల్లడించారు. కానీ లోకేష్ మాత్రం పోటీ బిజెపితోనే  అని ప్రకటిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ ముందు ఓ క్లారిటీకి వస్తే బాగుంటుందేమో. టీడీపీతో పొత్తు ఉన్నప్పుడే ఏపీలో బిజెపి పరిస్థితి అంతంత మాత్రం. పొత్తు బ్రేకప్ అయిన తర్వాత…ప్రత్యేక హోదాతో పాటు పలు హామీలు అమలు చేయని కారణంగా ఏపీ ప్రజలు టీడీపీపై కంటే బిజెపిపైనే ఎక్కువ కసి పెంచుకున్నారు.
ఈ రకంగా చేయటంలో టీడీపీ ఒకింత సక్సెస్ కూడా అయింది. నాలుగేళ్లు అదే బిజెపితో కలసి సాగటం టీడీపీకి మైనస్. అయితే ఏపీలో పెద్దగా ఉనికే లేని బిజెపితోనే తమ ప్రధాన పోటీ అని నారా లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు చూసి టీడీపీ నాయకులే కాదు..క్యాడర్ కూడా అవాక్కు అయిందని చెప్పొచ్చు. విభజన హామీల విషయంలో ఏపీ ప్రజలు ప్రస్తుతం బిజెపి మీద మంచి కాకతో ఉన్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తాము సొంతంగా అధికారంలోకి వస్తామని బిజెపి నేతలు గొప్ప గొప్ప ప్రకటనలు చేస్తున్నా…వాస్తవానికి అక్కడ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందనే చెప్పొచ్చు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే  ఎవరితోనూ పొత్తు లేకుండా ముందుకెళితే ఏపీలో బిజెపికి ఒకట్రెండు అసెంబ్లీ సీట్లు వచ్చినా గొప్పే. అది కూడా అభ్యర్ధుల స్వశక్తితో రావాలి తప్ప..పార్టీ బలంతో కాదు. అలాంటి పరిస్థితుల్లో నారా లోకేష్ తమ పోటీ బిజెపితోనే అని ప్రకటించటం ద్వారా ‘లేని శత్రువుతో పోరాటం చేస్తా అన్నట్లు’గా ఉందని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts