న్యూ డిల్లీ ఫిబ్రవరి 1
మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో ఫిబ్రవరి నెల ప్రారంభం కానుండటంతో చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను ప్రకటించాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను స్వల్పంగా పెంచగా.. దేశీయ గ్యాస్ సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలను చివరగా ఆగస్టు 30న సవరించిన చమురు కంపెనీలు.. ఇప్పటి వరకు ఎలాంటి మార్పు చేయలేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..
స్వల్పంగా పెరిగిన గ్యాస్ ధరలు..
వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 14 పెరగగా, కోల్‌కతాలో రూ.18 పెరిగింది. హైదరాబాద్‌లో రూ. 17 పెరిగింది. విజయవాడలో రూ. 17 పెరిగింది. ముంబైలో రూ.15 పెరిగింది. చెన్నైలో రూ.12.50 పెరిగింది. ఆయా నగరాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెరిగిన తరువాత రేట్స్ ఇలా ఉన్నాయి.
ఢిల్లీ - రూ. 1769.50
ముంబై - రూ. 1723.50
కోల్‌కతా - రూ. 2047.00
విజయవాడలో రూ. 1934.50
చెన్నై - రూ.1937.00
హైదరాబాద్ - రూ. 2002.00
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు..
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశీయ సిలిండర్ల ధరల్లో వరుసగా ఆరోసారి ఎలాంటి మార్పు లేదు. తాజాగా లెక్కల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.903. కోల్‌కతాలో ధర రూ.929గా ఉంది. ముంబై ప్రజలు గృహ గ్యాస్ సిలిండర్ ధర రూ.902.50 చెల్లించాలి. చెన్నైలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.918.50. హైదరాబాద్‌లో రూ. 955.00, విజయవాడలో రూ. 927 చొప్పున ఉంది. కాగా, ఆగస్టు 30, 2023 తర్వాత డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఆగస్టు 29న ప్రభుత్వం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 తగ్గించింది.
గ్రీన్ హైడ్రోజన్‌కు రూ.600కోట్లు