YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

క్రాస్ రోడ్ లో వామపక్షాలు

క్రాస్ రోడ్ లో వామపక్షాలు

విజయవాడ, ఫిబ్రవరి 3,
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కమ్యునిస్టు పార్టీల ఎటువైపు వెళతాయన్న ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకూ అయితే వామపక్ష పార్టీలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒంటరిగానే పోటీ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగున్నరేళ్లుగా అధికార వైసీపీ పోరాడిన కామ్రేడ్లతో కలిసేందుకు కూడా ఎవరూ ఇష్టపడటం లేదు. చూస్తుంటే పొరుగు రాష్ట్రమైన తెలంగాణ మాదిరిగానే ఏపీలో కూడా జరుగుతుందనిపిస్తుంది. తెలంగాణలో సీపీఐ కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకుని ఒక్కసీటును దక్కించుకుని అక్కడ విజయం సాధించింది. సీపీఎం అయితే తాము ఒంటరిగా బరిలోకి దిగుతామని చెప్పి పోటీ చేసి ఎక్కడా గెలవలేదు తెలంగాణలో సీన్ లాగే... తెలంగాణలో కొంత సీపీఐ బలంగా ఉంటే...ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సీపీఎం కాస్త మెరుగ్గా ఉంది. ఇక్కడ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గత నాలుగేళ్ల నుంచి చంద్రబాబుతో కలసి నడిచారు. అంటే టీడీపీతో జత కట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమస్యలపై ఉద్యమించడంలో తప్పు లేదు కానీ, టీడీపీ వాయిస్ లాగా సీపీఐని మార్చేశారన్న ఆరోపణలు తరచూ వినిపించాయి. అయితే ఇప్పుడు రామకృష్ణ వాయిస్ పెద్దగా వినిపించడం లేదు. చంద్రబాబు కూడా వారిని చేరదీసేందుకు ప్రయత్నించడం లేదనే అనిపిస్తుంది. టీడీపీతో జనసేన పొత్తు ఇప్పటికే ఏపీలో ఖరారయింది. అదే సమయంలో బీజేపీతో కూడా కలవాలని రెండు పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి.అందుకే సీపీఐ, సీపీఎంలను దూరం పెట్టారు. తాము ఏమాత్రం వారిని దరిచేర్చుకున్నా జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్న ఆరెండు పార్టీలను తీసుకున్నారని ఏపీలో తమపై నెగిటివ్ టాక్ నడిచే అవకాశముందని భావిస్తున్నారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ ను ఏపీ ప్రజలు ఇప్పటికీ సొంతం చేసుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో దానితో జాతీయ స్థాయిలో నడుస్తున్న కమ్యునిస్టులను కలుపుకుంటే తమకు ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్నారు. అలా కాకుండా కాంగ్రెస్, కమ్యునిస్టులు కలసి పోటీ చేస్తే వైసీపీ అనుకూల ఓటు చీల్చుకుంటే తమకు లాభమన్న ఆలోచన కూడా టీడీపీ అధినేత చేస్తున్నట్లు సమాచారం. ఎక్కడా కమ్యినిస్టుల ప్రస్తావన లేకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే జనసేనకు ఎక్కువ స్థానాలను కేటాయించాల్సి వస్తుండటంతో వారిని కలుపుకుంటే ఎన్ని స్థానలు ఇవ్వాల్సి వస్తుందోనన్న భయమూ ఆయనలో ఉందంటున్నారు. సీపీఐ మాత్రం చంద్రబాబు పిలుపు కోసం వెయిట్ చేస్తుంది. ఆ కూటమితో బీజేపీ జత కట్టకపోతే తాము దూరాలని ప్రయత్నిస్తుంది. అయితే చంద్రబాబు మాత్రం ఒకవేళ సీపీఐ వచ్చినా ఎక్కువ స్థానాలు ఇచ్చే అవకాశం ఉండదు. సీపీఐకి పెద్దగా ఓటు బ్యాంకు లేదని భావించిన టీడీపీ అధినేత రామకృష్ణ తో కొంతగ్యాప్ ఏర్పడినట్లే కనపడుతుంది. సీపీఎం మాత్రం కలిస్తే కాంగ్రెస్ లేకుంటే ఒంటరిగానే పోటీ చేస్తామని చెబుతూ ఆ పార్టీ కొంత క్లారిటీ ఉంది. ఇప్పుడు క్లారిటీ మిస్ అయి క్రాస్ రోడ్డు లో ఉంది మాత్రం కామ్రేడ్ రామకృష్ణ మాత్రమే.

Related Posts