నాలుగేళ్ల మోదీ పాలన, చేపట్టిన ప్రజాసంక్షేమ పథకాలు, అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 26 నుంచి జూన్ 11 వరకు నాలుగేళ్ల మోదీ వినూత్న పాలనపై విస్తృత చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మన్ తెలిపారు.రెండు రోజుల బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ముగిసిన సందర్భంగా డాక్టర్ లక్ష్మన్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... సమాజాన్ని కులం, మతం ప్రాతిపదికగా విభజించే కుట్ర జరుగుతోందని, అలాంటి కుట్రలను తిప్పికొట్టేందుకు బిజెపి విశిష్ట కృషి చేస్తుందన్నారు. గ్రామస్వరాజ్ అభియాన్‌లో భాగంగా తెలంగాణలో వివిధ కార్యక్రమాలు చేపట్టినట్లు, ముఖ్యంగా దళిత వాడల్లో పల్లెనిద్రతో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, బిజెపి అధిష్టానం కూడా కొనియాడిందని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు.మోదీ ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భావజాలాన్నిప్రపంచ వ్యాప్తంగా విస్తరింపచేసేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించాలని నిర్ణయించినట్లు డాక్టర్ కె లక్ష్మన్ తెలిపారు. నాలుగేళ్ల మోదీ వినూత్న పాలనపై విస్తృత చర్చలో భాగంగా దళితులను పార్టీకి చేరువ చేసేందుకు దళితవాడలు, పల్లె నిద్ర కొనసాగించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో దళిత అదాలత్‌లు, గిరిజన గర్జనలు కొనసాగించాలని నిర్ణయించినట్లు డాక్టర్ లక్ష్మన్ స్పష్టం చేశారు.మోదీ చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, మోదీ వినూత్న పాలనపై విస్తృత చర్చ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది రాష్ట్ర బిజెపి నాయకులు ఒక్కొక్కరు కనీసం 25 మంది వివిధ రంగాలకు చెందిన మేధావులు, విద్యావంతులను కలిసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 10000మంది ప్రణాళిక రూపొందించినట్లు డాక్టర్ లక్ష్మన్ తెలిపారు.దేశవ్యాప్తంగా 4 వేల మంది ప్రముఖ నాయకులు, లక్ష మంది మేధావులను కలిసేందుకు వ్యహాన్ని ఖరారు చేసినట్లు తెలిపారు. ఏ నెలలో ఏ కార్యక్రమాన్ని చేపట్టాలన్న దానిపై రోడ్ మ్యప్ రూపొందించామని, ముఖ్యంగా జూన్, జూలై నెలల్లో ప్రజల్లోకి వెళ్లేందుకు యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. మోదీ పాలనలో గుణాత్మకమైన మార్పులు, అభివృద్ధి పనులు గణాంకాలతో సహా ప్రజలకు వివరించాలని నిర్ణయించినట్లు డాక్టర్ లక్ష్మన్ చెప్పారు.ముఖ్యంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలికిచ్చిన హామీలను నెరవేర్చడంలో తీవ్రంగా విఫలమైందని, సర్వరోగ నివారిణి జిందాతిలిస్మాత్ అన్నట్లు రైతాంగ సమస్యలకు రైతుబంధు పథకం ఒక్కటే పరిష్కారం అన్నట్లు వ్యవహరించడం దారుణమని డాక్టర్ లక్ష్మన్ విమర్శించారు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగులకు ఉద్యోగాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, కేజీ టూ పీజీ ఉచిత విద్య వంటి హామీలను నెరవేర్చలేదని, ఈ క్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్‌షీట్‌ను తయారు చేస్తున్నట్లు డాక్టర్ లక్ష్మన్ తెలిపారు.రాబోవు రోజుల్లో యువమోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించేందుకు వ్యూహాన్ని ఖరారు చేసినట్లు డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. మేధావుల సమ్మేళనం, స్వచ్ఛ భారత్ అభియాన్ వంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయించినట్లు డాక్టర్ లక్ష్మన్ తెలిపారు.ఈ నేల 31న కేంద్ర న్యాయశాఖ మత్రి రవిశంకర్ ప్రసాద్ మోదీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్ మాలపై మీడియా సంపాదకులతో, మేధావులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు డాక్టర్ లక్ష్మణ్ వెల్లడించారు.మోదీని రాజకీయంగా ఎదుర్కోలేని, సిద్ధాంత వైరుధ్యాలున్న పార్టీలు, నాయకులు..మోదీకి వ్యతిరేకంగా కూటమి అంటూ వింత పోకడలకు పోతున్నారని, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అంటూ.. కుటుంబ ఫ్రంట్‌కు తెరలేపుతున్నారని డాక్టర్ లక్ష్మన్ విమర్శించారు. అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయిన నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసేలా కూటమిల పేరిట అనైతిక పొత్తులకు పాల్పడుతున్నారని, వీటిని ఎండగట్టేందుకు బిజెపి ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతుందని డాక్టర్ లక్ష్మన్ అన్నారు.రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం దారుణమని, జోనల్ వ్యవస్థతో ప్రభావితమయ్యే వర్గాలు, వివిధ పార్టీలను సంప్రదించకుండా టీఆర్ఎస్ ఏకపక్షంగా దుందుడుకు చర్చలకు దిగడం విడ్డూరంగా ఉందని డాక్టర్ లక్ష్మన్ విమర్శించారు. భూ రికార్డుల ప్రక్షాళన అస్తవ్యస్థంగా ఉందని, లక్షలాది మంది రైతులు తమ భూములకు సంబంధించిన రికార్డులు సరిగ్గా లేక ఆయోమయంలో పడ్డారని, ఇది ముమ్మాటికీ ముఖ్ మంత్రి, మంత్రులు, ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని డాక్టర్ లక్ష్మన్ అన్నారు.అవినీతి, అక్రమాలు, కుటుంబ, వారసత్వ పాలనలో కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ కూడా నాణానికి బొమ్మా బొరుసు వంటివని, పదేళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని డాక్టర్ లక్ష్మన్ దుయ్యబట్టారు.కర్ణాటక ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కలవడం విడ్డూరంగా ఉందని, గతంలో ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకున్న, సిద్ధాంత వైరుధ్యాలున్న పార్టీలు అధికారం కోసం కలిసి రావడం హేయనీయమని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. కర్ణాటకలో జేడీఎస్ పాత్రను తెలంగాణలో టీఆర్ఎస్ పోషించబోతుందని డాక్టర్ లక్ష్మన్ అన్నారు.పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారని, త్వరలోనే తెలంగాణలో అమిత్ షా పర్యటన ఉంటుందని డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. వచ్చే నెల 3, 4,5 తేదీల్లో జిల్లాల కార్యవర్గ సమావేశాలు, అనంతరం సభలు, అలాగే జూన్ 10,11,12,13 తేదీల్లో మండల కార్యవర్గ సమావేశాలు, అనంతరం సభలు నిర్వహించాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించినట్లు, అలాగే రాబోవు రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల వారిగా భారీ బహిరంగ సమావేశాలు, సభలు నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నట్లు డాక్టర్ లక్ష్మన్ తెలిపారు.2019 ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళతామని, తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని డాక్టర్ లక్ష్మన్ స్పష్టం చేశారు.