YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ ఎన్ని తప్పులు చేయకూడదో... అన్నీ చేశారు

జగన్ ఎన్ని తప్పులు చేయకూడదో... అన్నీ చేశారు

రాజమండ్రి, ఫిబ్రవరి 3
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్ని రకాల తప్పులు చేయకూడదో అన్నిరకాల తప్పులు చేసుకుంటూ పోతున్నాడని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. 175 స్థానాల్లో జగన్ తరపున కాదు.. జగనే పోటీ చేస్తున్నారని ఉండవల్లి సెటైర్ వేశారు. రాష్ట్రంలో అర్బన్ ఏరియాల్లో జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు కనపడుతున్నాయని ఉండవల్లి జోస్యం చెప్పారు. వైసీపీ కంటే ఎక్కువగా ఇస్తామంటూ టీడీపీ మేనిఫెస్టో ప్రకటిస్తున్నారని, వీటన్నింటిని ప్రజలకు అందించడం ఎలా సాధ్యమనే విషయాలను ఒకసారి పరిశీలన చేసుకోవాలని ఉండవల్లి అన్నారు. చదువుకున్నవారు రోడ్లు బాలేదనో, ఇంకేదో లేదనో వైసిపికి వ్యతిరేకం అవ్వొచ్చు. రూరల్లో మాత్రం వైసిపి పాజిటివ్ గా ఉంది జగన్ 40%, చంద్రబాబుకు 40% ఓట్ పర్సంటేజ్ వస్తాయనుకుంటున్నానని చెప్పుకొచ్చారు.  గత ఎన్నికలలో జనసేనకు 6% ఓట్ షేర్ రాగా, ఈ సారి పెరుగుతుందని చెప్పారు.  వాస్తవంగా జనసేన, టిడిపి కలిసాయంటే రాష్ట్రంలో షేక్ రావాలి కానీ  రాష్ట్రంలో అధికార పార్టీలో ఆ భయం కనిపించడం లేదన్నారు.  మోడీ, జగన్ ఒకటే, వారి నిర్ణయాలు వారివే ఒకరు మాట వినరన్నారు. కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ఉండవల్లి.. కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై చిన్నచూపు చూస్తోందని అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తరాదిలోనే ఎక్కువగా పెంచుతాని అన్నారు. జనాభాలోనూ.. అబద్దాలు ప్రచారం చేయడంలో ప్రపంచంలోనే మనదేశం నెంబర్ వన్ స్థానంలో ఉందని పేర్కొన్నారు. మన రాష్ట్రంలోఉన్న 25మంది ఎంపీలు బీజేపీకి మద్దతు దారులేనని.. ఇది చాలా దురదృష్టకరమన్నారు. బీజేపీ సిద్ధాంతాలను వ్యతిరేకించే అందరూ ఒకటి కావాలని ఉండవల్లి అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు.
దేశంలో ఆర్థిక దివాలా పేరుతో జరుగుతున్న మోసాలు వెలికితీయాల్సిన అవసరం ఉందని ఉండవల్లి వ్యాఖ్యానించారు.  బిజెపి వచ్చిన తరువాత కోటి కోట్ల‌అప్పులు చేశారని..  దేశంలో కోటి కోట్లతో‌ చేసిన అభివృద్ధి ఏంటయ్యా అంటే ఏమీ లేదనన్నారు.  నిన్న కేంద్రం మోస్ట్ మిస్ లీడింగ్ బడ్జెట్ ప్రవేశపెట్టారని.. వరల్డ్ ఎకనామిక్స్ ఫామ్ ఇచ్చిన నివేదికలో మిస్ ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని పేర్కొందన్నారు.  అబద్ధాలు ప్రచారం‌ చేయడంలో భారత్ నెంబర్ స్థానంలో ఉంది, అమెరికా 6వ స్థానంలో ఉంని గుర్తు చేశారు. ఇప్పుడు అంతా జైశ్రీరామ్ పేరుతో రాజకీయాలు నడుస్తున్నాయని రామాలయం కట్టడం తప్పులేదు, దాని పేరుతో రాజకీయ లబ్ధిపొందాలనుకోవడం తప్పని స్పష్టం చేశారు.  సౌదిఅరేబియాలో తప్ప ప్రపంచంలో అన్ని చోట్ల దేవాలయాలు కట్టుకునే అవకాశం ఉందన్నారు.  కానీ మన దేశంలో హిందూయిజం పేరుతో సెక్యూలర్ పాలన కొనసాగుతుందని.. బిజెపి చెబుతున్న మాటలు అసలు ఇప్పుడు హిందుత్వ రిలీజనే కాదన్నారు.  శంకరాచార్యలు కూడా విగ్రహప్రతిష్ఠ సరికాదని చెప్పారని..  అప్పుడు ఓ బిజెపి నేత శంఖరాచార్యులపైనే విమర్శలు చేసాడని ఉండవల్లి తెలిపారు. మోడీకి తన పరిపాలన మీద ఎన్నికలకు వెళ్తే ఏమవుతుందో తెలుసు కాబట్టి శ్రీరాముడి నమ జపం ఎత్తుకున్నారని విమర్శించారు.  

Related Posts