YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆ ఆరింటిపై కసరత్తులు

ఆ ఆరింటిపై  కసరత్తులు

విజయవాడ, ఫిబ్రవరి 5
వై నాట్ 175 ప్లస్.. 25 ఎంపీ సీట్స్.. రెండోసారి అధికారం దక్కించుకోవడంతోపాటు.. అత్యధికంగా ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు వైసీపీ ఫోకస్ పెట్టింది. ఒకవైపు సిద్ధం సభలు, ఇంకోవైపు వ్యూహాలు రచిస్తున్న వైసీపీ అధిష్టానం, ఇన్‌చార్జ్‌ల నియామకంపై వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే 17 ఎంపీ సెగ్మెంట్లకు ఇన్‌చార్జ్‌లను మార్చింది. అయితే ఆరు పార్లమెంటు సెగ్మెంట్లకు ఇన్‌చార్జ్‌ల నియామకంపై కసరత్తులు జరుగుతున్నాయి. విజయనగరం, అనకాపల్లి, అమలాపురం, బాపట్ల, ఒంగోలు, నంద్యాల స్థానాల ఇన్‌ఛార్జ్‌ల కోసం అధిష్ఠానం అన్వేషణ సాగిస్తోంది. ఇన్‌ఛార్జ్‌గా నియమించే వ్యక్తి బలాబలాలు, సామాజిక సమీకరణాలు అన్నిటినీ ఇందుకోసం పరిశీలిస్తున్నారు.కాగా.. సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ హైకమాండ్‌ ఇప్పటివరకు ఆరు జాబితాల్లో మార్పులు చేర్పులు చేసింది. ఈ మార్పుల్లో భాగంగా 17 ఎంపీ, 64 అసెంబ్లీ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను మార్చారు. అయితే మరో 8 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వీటితో కడప, రాజంపేట స్థానాలను సిట్టింగ్‌లనే బరిలోకి దించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.అయితే, ఏడో జాబితా త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ జాబితాలో కీలక మార్పులుంటాయని.. వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. సీటు ఎవరికి దక్కుతుంది..? ఎవరికి ఈ సారి దక్కదు అనే చర్చ మొదలైంది

Related Posts