విజయవాడ, ఫిబ్రవరి 5
ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. టీడీపీ వైపు వైసీపీ సీటింగ్ ఎమ్మెల్యేలు చూస్తుండడమే ఇందుకు కారణం. టీడీపీలో పార్థసారథి, వసంత కృష్ణ ప్రసాద్ చేరిక ఖాయమని పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. తిరువూరు నియోజకవర్గంలో కొలికలపూడి శ్రీనివాసరావు కూడా తెరపైకి వచ్చారు. దీంతో ప్రస్తుత తిరువూరు ఇన్‌చార్జ్ శావల దేవదత్ ఆందోళనలో ఉన్నారు. పార్థసారధిని నూజివీడుకి ఒప్పించింది టీడీపీ హై కమాండ్.మైలవరం, పెనమలూరు టీడీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. దేవినేని ఉమా వర్సెస్ వసంత కృష్ణ ప్రసాద్ గా పరిస్థితులు మారాయి. వీరిద్దరిలో ఒకరికి పెనమలూరు మరొకరికి మైలవరం కేటాయించేలా అధిష్ఠానం ఆలోచనలో ఉంది. ఇప్పటికే ఈ రెండు నియోజకవర్గాల్లో వివిధ ఏజెన్సీల ద్వారా సర్వేలు నిర్వస్తోంది పార్టీ హైకమాండ్.విజయవాడ పశ్చిమ టీడీపీలో గందరగోళం నెలకొంది. బుద్ధా వెంకన్న, జలీల్ ఖాన్ పోటాపోటీ బల ప్రదర్శనలు జరుగుతున్నాయి. విజయవాడ పశ్చిమ టికెట్ మైనార్టీలకు ఇవ్వాలంటూ రోడ్డు ఎక్కారు పలువురు టీడీపీ నేతలు. పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చే సీట్లపై క్లారిటీ లేదు. విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ జనసేనకు అంటూ ప్రచారం జరుగుతోంది. నూజివీడులో ప్రస్తుతం ఇన్‌చార్జిగా ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఉన్నారు. తనని విస్మరిస్తే ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతానంటూ సందేశాలు ఇస్తున్నారు. మరో వైపు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు వైసీపీ షాక్ ఇచ్చింది. మైలవరం ఇంఛార్జిగా శ్వర్నాల తిరుపతి రావుని ఖరారు చేసింది అధిష్టానం. తిరుపతి రావు ప్రస్తుతం మైలవరం జెడ్పీటీసీగా ఉన్నారు. యాదవ సామాజికవర్గానికి చెందిన తిరుపతి రావును సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్థానంలో నియమించారు.ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు వైసీపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. చాలా కాలంగా వసంత కృష్ణ ప్రసాద్ అసంతృప్తిగా ఉన్నారు. దాంతోపాటు ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని మైలవరం ఇంఛార్జిగా నియమిస్తూ వైసీపీ నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నేతలు కేశినేని నాని, జోగి రమేశ్ సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. మైలవరం నియోజకవర్గానికి సంబంధించి చర్చించారు.
మైలవరం వైసీపీ ఇంఛార్జిగా శ్వర్నాల తిరుపతి రావును ఖరారు చేసింది హైకమాండ్. ఆయన యాదవ సామాజికవర్గానికి చెందిన నేత. ప్రస్తుతం మైలవరం జెడ్పీటీసీగా ఉన్నారు. ఆయననే మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు జగన్