YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోడీతో నితీష్ కు చెడిందా

 మోడీతో నితీష్ కు చెడిందా
ప్రధాని నరేంద్ర మోదీ, బీహార్ సీఎం నితీష్‌కుమార్ మధ్య మరోసారి చెడినట్లే కనిపిస్తున్నది. మూడు రోజుల కిందట నోట్ల రద్దుపై యూటర్న్ తీసుకున్న నితీష్‌కుమార్.. ఇప్పుడు బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. బీహార్‌లో బీజేపీతో మళ్లీ చేతులు కలిపిన తర్వాత నోట్ల రద్దును ఆకాశానికెత్తిన నితీష్.. ఇప్పుడు మాట మార్చారు. ఇక 15వ ఆర్థిక సంఘానికి ఇచ్చిన సిఫారసులను కూడా ఆయన ప్రశ్నించారు.2011 జనాభా లెక్కల ప్రకారం నిధుల పంపిణీ సరైన నిర్ణయమే అయినా.. దీనివల్ల బీహార్‌కు పెద్దగా ఒరిగిందేమీ లేదని, పైగా గతంలో కంటే తక్కువ నిధులు వస్తున్నాయని నితీష్ చెప్పారు. ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేస్తూ బీహార్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2000ను ప్రస్తావించారు. ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ అధ్యక్షతన ఓ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి బీహార్ ప్రత్యేక ఆర్థిక అవసరాలను చూసుకోవాలని ఆ చట్టం స్పష్టంగా చెప్పినట్లు నితీష్ గుర్తు చేశారు. ప్రస్తుతం ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ ఉండటంతో దాని ఆధ్వర్యంలో అలాంటిదే ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.తలసరి ఆదాయం, విద్య, ఆరోగ్యం, విద్యుత్‌లాంటి అంశాల్లో జాతీయ సగటు కంటే బీహార్ సగటు చాలా తక్కువగా ఉన్నదని, అందుకే తాము ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పటికే ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఏ రాష్ర్టానికీ కొత్తగా హోదా ఇవ్వడం లేదంటూ కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్‌ను పట్టించుకోవడం లేదు.

Related Posts