YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సాగు నీటికి సమస్యే!

సాగు నీటికి సమస్యే!
 కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతం వరుస కరువులకు గురవుతోంది. ఇలాంటి ఏరియాపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ నుంచి 4 ఏళ్లుగా నీరు పారుతున్నా ఫలితం లేకుండా ఉందని అంటోంది. హంద్రీనీవా నీటిని పొలాలకు మళ్లించే విషయం పక్కనపెడితే కనీసం గొంతు తడిపేందుకు కూడా ఇవ్వని దుస్థితి నెలకొందని అంతా అంటున్నారు. జిల్లాలో హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ పరిధిలో 80 వేల ఎకరాలు స్థిరీకరించిన ఆయకట్టు ఉంది. ఇందులో 10 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. ఈ పరిధి విస్తరించాలంటేప్రభుత్వం 20 కోట్లు వెచ్చించి పంట కాలువలను పూర్తి చేస్తే 80 వేల ఎకరాలకు సాగునీరు అందుంతుందని రైతులు చెప్తున్నారు. నాలుగేళ్లుగా పంట కాలువలు పూర్తి చేసే విషయంలో ఉదాసీనత అలముకోవడంతో వ్యవసాయ క్షేత్రాలకు పూర్తిస్థాయిలో నీరు అందడంలేదని వ్యాఖ్యానిస్తున్నారు. హంద్రీనీవా పంట కాల్వను పూర్తి చేయాలని, జిల్లాలో నిత్యం కరువు కాటకాలకు గురయ్యే పశ్చిమ ప్రాంతంలో హంద్రీనీవా నుంచి చెరువుల్లోకి నీటిని నింపాలని చాలాకాలంగా రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.  రైతుల విజ్ఞప్తులపై స్పందించిన ప్రభుత్వం 106 చెరువులకు నీటిని నింపుతామని హామీ ఇచ్చింది. అయితే ఆ హామీ అమలులోకి రాలేదని రైతన్నలు వాపోతున్నారు. 106 చెరువులకు నీళ్లు నింపుతామని చెప్పిన ప్రభుత్వం 64 చెరువులకు కుదించిందని అంటున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం కూడా నత్తనడకన సాగుతోందని అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. సంబంధిత అధికార యంత్రాంగంహంద్రీనీవా వెంట ఉండే చెరువులకు నీటిని నింపే కార్యక్రమం సత్వరమే ప్రారంభించాలని అంతా విజ్ఞప్తి చేస్తున్నారు.  

Related Posts