YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అన్నీ పార్టీల నోట వైనాట్ 175 మాట

అన్నీ పార్టీల నోట వైనాట్ 175 మాట

విజయవాడ, ఫిబ్రవరి 8
ఎన్నికల వేళ మైలేజ్‌ కోసం మాటల యుద్ధానికి దిగుతున్నాయి పార్టీలు. ఎవ్వరికెవరూ తగ్గడం లేదు. విపక్షాలు మీసం మెలేస్తూ అధికార పార్టీని కార్నర్ చేస్తుంటే.. అదే స్పీడ్‌తో ప్రత్యర్థుల మతిపోగొట్టేలా కౌంటర్‌ ఎటాక్‌లతో విరుచుకుపడుతోంది వైసీపీ. ఏపీ గట్టుపై పవర్ పాలిటిక్స్‌.. రోజురోజుకి హీట్ పెంచేస్తున్నాయి.వై నాట్‌ 175 టార్గెట్‌తో.. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల మార్పులు.. సిద్ధం పేరుతో ఎన్నికల శంఖారావం పూరించింది వైసీపీ. వేర్వేరు పథకాలతో ప్రజలకు జరిగిన మేలు.. మళ్లీ ఎందుకు ఓటు వేయాలో సిద్ధం సభల్లో వివరిస్తున్నారు సీఎం జగన్‌. మరోవైపు టీడీపీ కూడా ప్రజల మధ్య ఉండేలా వ్యూహాలు రచిస్తోంది. రా.. కదలిరా పేరుతో నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ టీడీపీని ఆదరించాలని ప్రజల్ని వేడుకుంటున్నారు చంద్రబాబు.సీఎం జగన్‌ కటౌట్‌ చూస్తే ప్రభుత్వం పెట్టిన బాధల్ని ప్రజలు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు టీడీపీ అధినేత. మరోవైపు చంద్రబాబు పేరు వింటే ఏం గుర్తుకొస్తుందో చెబుతూ అసెంబ్లీలో నవ్వులు పూయించారు ముఖ్యమంత్రి. సీఎం జగన్‌ బటన్‌ నొక్కుడుపైనా విమర్శలు చేశారు చంద్రబాబు. ప్రజలంతా ఆయన ఇంటికి పోయేలా ఒకే ఒక్క బటన్ నొక్కడం ఖాయమన్నారు. ఇక ప్రజల మేలు కోసం 124సార్లు బటన్‌ నొక్కిన ప్రభుత్వాన్ని మళ్లీ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు సీఎం జగన్‌.2024 తర్వాత వైసీపీ కనుమరుగు కావడం ఖాయమన్నారు చంద్రబాబు. అటు సీఎం జగన్ మాత్రం 175 అసెంబ్లీ.. 25 ఎంపీ సీట్లలో గెలవాల్సిందేనన్నారు. ఒకరు సిద్ధం.. మరొకరు సంసిద్ధం.. పేరు ఏదైనా ఎన్నికల రణక్షేత్రంలో తాడోపేడో తేల్చుకునేందుకు వైసీపీ, టీడీపీ రెడీ అయ్యాయి. మరి ప్రజలు ఎవరి వైపు చూస్తారన్నది చూడాలి

Related Posts