YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

క్రిష్ణాలో నాలుగు సీట్లపై పవన్

క్రిష్ణాలో నాలుగు సీట్లపై పవన్

విజయవాడ, ఫిబ్రవరి 9
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ - జనసేన మధ్య సీట్ల పంచాయితీ తేలటం లేదు. ఇప్పటి వరకు జనసేనకు ఎన్ని సీట్లను కేటాయిస్తారనే అంశంపై తెలుగుదేశం పార్టీ క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో జనసేన పార్టీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. సోషల్ మీడియాలో మాత్రం సీట్ల కేటాయింపుపై ఇప్పటికే ప్రచారం హొరెత్తుతోంది. 23 అసెంబ్లీ సీట్లతో పాటు రెండు పార్లమెంట్ సీట్లు కేటాయిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన నాలుగు స్థానాలు డిమాండ్ చేస్తుంటే...తెలుగుదేశం పార్టీ ఎన్ని ఇవ్వడానికి రెడీగా ఉంది.. ఏ ఏ సీట్లు ఇస్తుందన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది.  ప్రధానంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ-జనసేన మధ్య సీట్ల పంచాయితీ ఇంకా కొలిక్కిరావడం లేదు. జిల్లాలో జనసేన కచ్చితంగా నాలుగు స్థానాలను కేటాయించాలని...తెలుగుదేశం పార్టీకి తేల్చి చెప్పినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా...అటు టీడీపీ నేతలు కూడా సీట్ల కేటాయింపు వ్యవహారంలో పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. జనసేన నాలుగు సీట్లు అడుగుతుంటే...రెండు లేదా మూడు సీట్లకు మాత్రమే పరిమితం చేయాలనే ఉద్దేశంలో టీడీపీ స్థానిక నేతలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, పెడన, కైకలూరు స్థానాల్లో పోటీ చేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.నాలుగు స్థానాల్లో   జనసేన నుంచి పోటీ చేయటానికి అభ్యర్థులు కూడా పూర్థి స్థాయిలో రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ నుంచి క్లారిటీ కోసం మాత్రమే ఎదురుచూస్తున్నారు. కీలకమైన బెజవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే...ఇక్కడ నుంచి జనసేన అభ్యర్థిగా పోతిన వెంకట మహేష్ దాదాపు ఖరారైనట్టుగానే పార్టీ వర్గాల సమాచారం. అయితే టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా, జలీల్ ఖాన్‌...తమలో ఒకరికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. కైకలూరు సీటును కూడా జనసేన ఆశిస్తోంది. ఇక్కడ నుంచి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పోటీ చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కుమారుడి కోసం పెడన సీటును జనసేన నేతలు కోరుతున్నారు. మరోవైపు ఇదే అసెంబ్లీ సీటును మాజీ మంత్రి కాగిత వెంకట్రావు కుమారుడు  కాగిత కృష్ణప్రసాద్ ఆశిస్తున్నారు. ఆయన గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పటికే కాగిత  కృష్ణప్రసాద్ తన ప్రచార కార్యక్రమాల్లో పెడన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ...స్టిక్కర్లు వేసుకొని కార్యక్రమాలు చేస్తున్నారు నియోజకవర్గంలో కాపు, గౌడ వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉండటంతో...ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశంపై టీడీపీ, జనసేన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అవనిగడ్డ నియోజకవర్గం సీటు కూడా తమకే ఇవ్వాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. జనసేన అభ్యర్థిగా విక్కుర్తి శ్రీనివాస్ పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. శ్రీనివాస్ ఇప్పటికే పవన్ కల్యాణ్ ను కూడా కలిశారని, ఆయన నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నారు. ఇక్కడి నుంచి సీనియర్ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే జనసేన మాత్రం ఖచ్చితంగా ఈ టికెట్ ఇవ్వాల్సిందేనని తెలుగుదేశంపార్టీపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది.

Related Posts