విజయవాడ
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ కోసం జనసైనికుల బాహాబాహి నడుస్తోంది. ఈ సీటు ముస్లింలకు కేటాయించాలని గయాజుద్దీన్ బలప్రదర్శన కు దిగారు. ఈ నేపధ్యంలో గురువారం రాత్రి పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ పోతిన మహేష్ కార్యాలయం దగ్గరకు గయాజుద్దీన్ అనుచరులు చేరుకున్నారు. పోతిన మహేష్ కార్యాలయం ఫొటోస్ తీస్తుండగా ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలయింది. ఫొటోస్ ఎందుకు తీస్తున్నారు అంటూ మహేష్ అనుచరులు అడిగారు. మా ఇష్టం అంటూ గయాజుద్దీన్ అనుచరులు సమాధానం చెప్పడంతో గొడవ ప్రారంభమయింది. ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. కొంత కాలంగా మహేష్ కి వ్యతిరేకంగా గయాజుద్దీన్ గ్రూప్ కట్టిన విషయం తెలిసిందే. గతంలో కూడా గయాజుద్దీన్ భారీ ర్యాలీ నిర్వహించారు. గయాజుద్దీన్ జనసేన సభ్యుడు కాదని గతంలో మహేష్ చెప్పారు. నేను జనసేన సభ్యుడినని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటావా అంటూ గయాజుద్దీన్ సవాల్ చేసారు. జనసైనికుల ఫైటింగ్ తో జనసేన పశ్చిమ రాజకీయం హట్ హాట్ గా మారింది. -- గయాజుద్దీన్ అనుచరులపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మహేష్ అనుచరులు కేసు పెట్టారు.