YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

వహ్వా సబ్జా!

వహ్వా సబ్జా!
వేసవికాలంలో మే చివరి వారం అంటే అందరికీ హడలే. రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. దీంతో జనాలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైపోతుంటారు. ఉష్ణతాపాన్ని జయించేందుకు ప్రజలు ఎక్కువగా మంచినీళ్లు, మజ్జిగ, పండ్లరసాలు సేవిస్తుండాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. అయినప్పటికీ వేడెక్కిపోతున్న వాతావరణం ప్రజారోగ్యాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటోంది. ఇదిలాఉంటే.. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు సబ్జాలతో చేసిన పానియాలు మంచివని పలువురు అంటున్నారు. చౌకగానే లభించే ఈ గింజలు అద్భుతమైన శక్తిని ఉత్తేజాన్ని నింపుతాయని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సబ్జాలు దాహార్తిని తీర్చగలవు. డీ హైడ్రేషన్‌ తగ్గించగలవు. శరీర ఉష్ణోగ్రతలు, వాంతులు, విరోచనాలు శ్వాస కోస వ్యాధులు, అజీర్తి, మధుమేహాన్ని సైతం అదుపులో ఉంచగలవు. అంతేకాక హానికరమైన విషక్రిములు కడుపులో చేరకుండ నివారించగలవు. కడుపులో మంట, ఆస్థమా, గొంతునొప్పి దరిచేయనీయవని నిపుణులు అంటున్నారు. అందుకే సబ్జా గింజలను ఏదైనా పండ్ల రసాలతో కలసి తాగాలని సూచిస్తున్నారు. 
 
ఇక సబ్జా గింజలు మహిళలకు ఆరోగ్యప్రదాయనే అని అంటున్నారు ఆహార నిపుణులు. అధిక బరువుతో బాధపడేవారికి సబ్జా నీరు తాగితే మంచి ఫలితముంటుందని చెప్తున్నారు. సబ్జా పానీయం బరువును తగ్గించడమేకాకుండా శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో తోడ్పడుతుందట. శరీర జీవక్రియలను మరింత మెరుగుపరుస్తుందట. సబ్జాలో ఫైబర్ ఎక్కువ. ఇదిలాఉంటే సబ్జాలను అల్లం, తేనెతో కలిపి తాగితే శ్వాసకోశ వ్యాధులనూ నివారిస్తాయట. ఈ నల్లటి సీడ్స్ లో చర్మాన్ని అందంగా ఉంచి విటమిన్‌ ఇ ఎక్కువగా ఉంటుంది. చర్మ సంబంధిత వ్యాధులను అరికడుతుంది. సబ్జా గింజల ఉపయోగాలపై ఇటీవలిగా ప్రజల్లో కొంత అవగాహన వచ్చింది. దీంతో వీటి వాడకం రోజు రోజుకు పెరుగుతోంది. వేసవిలో ఎండ నుంచి ఉపశమనం పొందడానికి అప్పుడప్పుడు తయారు చేసే శీతలపానీయాల్లో వాడుతున్నారు. ఇటీవల కాలంలో పలువురు ప్రతి పానీయంలోనూ సబ్జాలను చేర్చుకుంటున్నారు. మరి ఇంకెందుకాలస్యం.. మీరూ సబ్జాలను ఆహారంలో భాగంగా చేర్చుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Related Posts