YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మాజీ ప్రధానులు పీవీ, చరణ్ సింగ్‌కి భారతరత్న -

 మాజీ ప్రధానులు పీవీ, చరణ్ సింగ్‌కి భారతరత్న -

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9
మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహా రావుకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ఈ ప్రకటన చేశారు. X వేదికగా పోస్ట్ పెట్టారు. పీవీ నరసింహా రావుని భారతరత్నతో సత్కరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. పీవీ నరసింహారావుతో పాటు మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్‌కి కూడా భారతరత్న ప్రకటించారు. వీరితో పాటు భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథ్‌ను దేశ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా వీళ్ల సేవల్ని గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ. పీవీ నరసింహా రావు ఓ మేధావి అంటూ ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్రమంత్రిగానూ తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించారని అన్నారు. అటు ఎంపీగానూ ఎన్నో ఏళ్లుగా సేవలందించారని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పిన వ్యక్తి అంటూ కొనియాడారు. దేశ అభివృద్ధికి బలమైన పునాది వేశారని అన్నారు. ప్రధానిగా ఆయన అందించిన సేవల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటామని వెల్లడించారు. మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌కీ భారతరత్న ఇస్తున్నట్టు ప్రకటించారు ప్రధాని మోదీ. దేశానికి ఆయన అందించిన సేవలకు లభించిన సత్కారమని వెల్లడించారు. రైతుల సంక్షేమం, హక్కుల కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, దేశ హోం మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆయన అందించిన సేవల్ని స్మరించుకున్నారు. ఎమర్జెన్సీ రోజులకు ఎదురు నిలిచి ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేసుకున్నారు. ఆయన దేశానికి స్ఫూర్తిదాయకం అని అన్నారు.ఇక హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్‌ ఎస్ స్వామినాథన్‌ సేవల్నీ గుర్తు చేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ వ్యవసాయ రంగానికి, రైతులకు ఆయన అందించిన సేవలను ఇలా గౌరవించుకుంటున్నట్టు వెల్లడించారు. వ్యవసాయ రంగంలో భారత్ ఆత్మ నిర్భరతతో నిలబడడానికి కారణం స్వామినాథన్ అంటూ ప్రశంసించారు. ఆయన కేవలం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా...ఆహార భద్రతనూ కల్పించారని అన్నారు.

Related Posts