హైదరాబాద్, ఫిబ్రవరి 13,
గత ప్రభుత్వ హయాంలో కీలక శాఖల్లో చక్రం తిప్పిన బీహార్‌కు చెందిన ఐఏఎస్ అధికారుల్లో గుబులు మొదలయింది. బీహార్ ఐఏఎస్ లకే పెద్దపీట వేశారని గతంలో పలుమార్లు ఆరోపించిన రేవంత్ రెడ్డి..అధికారంలోకి రాగానే వారిపై ఫోకస్ పెట్టారు. గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారుల శాఖల్లో అక్రమాల నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. రేవంత్ సర్కార్ బిగిస్తున్న ఉచ్చుతో బీహార్ బాబులు టెన్షన్ టెన్షన్‌తో గడుపుతున్నారు. సోమేశ్‌కుమార్ లాండ్ ఎపిసోడ్‌తో ఈ టెన్షన్ మొదలయింది. దీంతో ముందు జాగ్రత్త చర్యలు మొదలుపెట్టారు.ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఓ అడుగు ముందుకేసి… భూబదలాయింపునకు రంగం సిద్ధం చేసుకున్నారు. బాలానగర్ హేమాజీపుర్‌లో ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కుటుంబసభ్యులకు 52 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని అర్జంట్‌గా బదిలీ చేసే పనిలోపడ్డారు ఆ అధికారి. ఇప్పటికే ల్యాండ్ ట్రాన్స్‌ఫర్ కోసం స్లాట్ బుక్ చేసేసుకున్నారు. గతంలో ఇరిగేషన్ శాఖలో కీలకంగా పనిచేసిన ఆ రిటైర్డ్ అధికారి అప్పట్లో ఓ కాంట్రాక్ట్ సంస్థతో లాలూచీ పడ్డట్టు ఆరోపణలున్నాయి. ఈ లాలూచీ వ్యవహారంపై మీడియాలోనూ వరుస కథనాలు వచ్చాయి. వ్యవహారం కోర్టు దాకా కూడా వెళ్లింది. ఇక ఇప్పుడు బీహార్‌కు చెందిన ఐఏఎస్ అధికారులు సోమేశ్, అరవింద్ కుమార్ చుట్టూ వివాదాలు చెలరేగడంతో..ఇప్పుడా రిటైర్డ్ అధికారి తాను సమస్యల్లో చిక్కుకోకుండా బయడపడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా రేవంత్ సర్కార్.. విజిలెన్స్ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.