YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మరో వివాదంలో ముత్తిరెడ్డి

మరో వివాదంలో ముత్తిరెడ్డి

కరీంనగర్, ఫిబ్రవరి 13,
అధికారంలో ఉన్నా లేకపోయినా వివాదాలు మాత్రం ఆ నేతను నీడలా వెంటాడుతున్నాయి. నాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్వంత కూతురితో విమర్శలు ఎదుర్కొన్న నేత ఇప్పుడు తాజాగా మరో వివాదంలో జనంలో చర్చగా మారారు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిత్యం వార్తల్లో నిలిచే జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇప్పుడు మరో వివాదంతో హాట్ టాపిక్ అయ్యాడు. ఇంతకీ వివాదానికి కారణం ఏంటంటే..?జనగామలోని బతుకమ్మకుంట పార్క్ ముఖద్వారానికి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేరు పెట్టారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ బతుకమ్మ కుంట పార్క్ విషయంలో చిన్నపాటి యుద్దమే జరిగింది. ముత్తిరెడ్ది పట్టుబట్టి మరీ ఇక్కడ పార్క్ నిర్మించారు. పార్క్ ఎంట్రెన్స్ లో నిర్మించిన ముఖద్వారానికి అప్పుడున్న అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేరు పెట్టారు. శిలాఫలకంలో పేరు పెట్టడం కామన్… కానీ ఏకంగా ముఖ ద్వారంపై బారీ అక్షరాలతో నేమ్ ఏర్పాటు చేశారు. ఆయన ఎమ్మెల్యే గా ఉన్నంత కాలం ఎవరూ విమర్శించ లేదు.. తాజాగా ముత్తిరెడ్డి నేమ్ బోర్డ్ పై విమర్శలు వెల్లువెత్తాయి..ముఖద్వారంపై ఆయన పేరు ఉండడం పట్ల రాజకీయ ప్రత్యర్థుల నుంచి విమర్శలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రజాధనంతో నిర్మించిన బతుకమ్మకుంట ముఖద్వారానికి మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేరు ఉండడం ఏంటని ప్రజలు ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే పేరును కొనసాగింపుపై అభ్యంతరాలు రావడంతో మున్సిపల్ అధికారులు స్పందించారు. ముఖద్వారానికి ఏర్పాటుచేసిన మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నేమ్ తొలగించి వివాదానికి తెరదించారుఅయితే ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్యలని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అభిమానులు ఆరోపిస్తున్నారు. తనపై ఎన్ని నిందలు వచ్చినా సహించి ప్రజల కోసం.. జనగామకు ఒక మంచి పార్క్ ఉండాలనే సంకల్పంతో ముందుపడి బతుకమ్మకుంట పార్క్ నిర్మించిన ముత్తిరెడ్డి పై విషం చిమ్ముతున్నారని ఆరోపిస్తున్నారు.వరుస వివాదాల కారణంగా గత ఎన్నికల్లో ముత్తిరెడ్డికి బీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్యే టిక్కెట్ నిరాకరించింది. ఆయన స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ టికెట్‌పై పోటీ చేసి విజయం సాధించారు.

Related Posts