YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నదీ జలాలపై కేంద్ర పెత్తనం ఒప్పుకోం

నదీ జలాలపై కేంద్ర పెత్తనం ఒప్పుకోం

హైదరాబాద్
తెలంగాణ నదీ జలాల పైన కేంద్రం పెత్తనానికి దాసోహమన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ మంగళవారం  నల్లగొండలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు పార్టీ బృందం బయలుదేరింది. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ నుంచి చలో నల్గొండ బహిరంగ సభకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు బయలుదేరారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి  మీడియాతో మాట్లాడారు ఈ రోజు పార్టీ ప్రజా ప్రతినిధులను సీనియర్ నాయకులను అంత నల్గొండ బహిరంగ సభకు బయలుదేరి వెళుతున్నాము. తెలంగాణ నదీ జలాల పైన కేంద్రం పెత్తనాన్ని గత పది సంవత్సరాలుగా అడ్డుకున్నది మా పార్టీ ప్రభుత్వం. నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం కేవలం రెండు నెలల్లోని కృష్ణ గోదావరి నది జలాల బోర్డులకు నదుల నిర్వహణను అప్పజెప్పిందని అన్నారు.
తెలంగాణ రైతాంగం భవిష్యత్తును అంధకారం చేసే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మా పార్టీ వివరంగా గళం ఎత్తింది. బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు భయపడిన కాంగ్రెస్ ప్రభుత్వం తోకముడిచింది. నిన్న అసెంబ్లీలో అబద్దాలను ప్రచారం చేసింది. తెలంగాణ ప్రజలకు నిజాలు తెలియని చెప్పాల్సిన అవసరం మా పైన ఉన్నది,ని అన్నారు. తెలంగాణ నదీ జలాల పైన కేంద్రం పెద్దనాన్ని ఎట్టి పరిస్థితులలో ఒప్పుకోం. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని అన్నారు.

Related Posts