YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

రైల్వేలో కన్ఫార్మ్ టికెట్ యాప్

రైల్వేలో కన్ఫార్మ్ టికెట్ యాప్
మీరు వెయిటింగ్ లిస్ట్ టికెట్ తీసుకున్నారా? అది కన్ఫార్మ్ అవుతుందో లేదో అని అనుమానంగా ఉందా? డోన్ట్ వర్రీ.. అది కన్ఫార్మ్ అవుతుందో లేదో చెప్పేసే సరికొత్త సాంకేతికతను ఐఆర్‌సీటీసీ బుధవారం నుంచి అందుబాటులోకి తేనుంది. దీనివల్ల ప్రయాణికుడు ఎలాంటి సందేహం లేకుండా ‘వెయింటింగ్ లిస్ట్’ టికెట్‌ను ధైర్యంగా బుక్ చేసుకోవచ్చు.ప్రయాణికులు వెయింటింగ్ లిస్ట్ టికెట్ బుక్ చేసుకున్నా.. అది కన్ఫార్మ్ అవుతుందా లేదా అనే అనుమానం ఉంటుంది. దీంతో ప్రత్యామ్నయంగా తత్కాల్ టికెట్ కూడా బుక్ చేసుకుంటున్నారు. దీనివల్ల రెండు విధాలా నష్టపోతున్నారు. వెయింటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫార్మ్ కానట్లయితే రైల్వే రూ.60ల ఛార్జీ వసూలు చేస్తోంది.  కొత్త సాంకేతికతతో అందించే ముందస్తు అంచనా వల్ల వెయింటింగ్ లిస్ట్ టికెట్.. కన్ఫార్మ్ అవుతుందో లేదో ముందుగానే తెలుసుకుని, అవకాశం ఉంటేనే బుక్ చేసుకునే వీలు కలుగుతుంది. అయితే, ఇటువంటి యాప్ ఇప్పటికే మొబైల్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ‘కన్ఫార్మ్ టికెట్’ యాప్ ద్వారా ఈ వివరాలు తెలుసుకోవచ్చు. అయితే, ఐఆర్‌సీటీసీ ద్వారా వచ్చే అంచనాలు ప్రయాణికులకు మరింత ఉపయోగకరంగా ఉంటాయి. బుకింగ్ ట్రెండ్స్, హిస్టరీ ఆధారంగా ఐఆర్‌సీటీసీ ఈ సమాచారాన్ని చెప్పగలదు. వెయింటింగ్ లిస్ట్ టికెట్ ఎంత శాతం కన్ఫార్మ్ అవడానికి అవకాశం ఉందో చెబుతుంది. రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఆలోచన నుంచి ఇది పుట్టిందని, దీన్ని అందుబాటులోకి తేడానికి ఏడాది సమయం ఇచ్చారని ఓ సీనియర్ రైల్వే అధికారి తెలిపారు. రైల్వేలోని గత 13 ఏళ్ల డేటా ఆధారంగా టికెట్ ‘కన్ఫర్మేషన్’ సమాచారాన్ని అందించేలా ఈ సాంకేతికతను రూపొందించారు. ఒక రైలు టికెట్ సంబంధించి.. ఆ డేటాలో సంక్షిప్తమై ఉన్న సమాచారం ఈ అంచనాలను అందిస్తుంది.టికెట్ బుకింగ్స్‌లో రైల్వే మరో సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చిందని అధికారులు తెలిపారు. టికెట్ బుక్ చేసుకోడానికి ముందు ఐఆర్‌సిటీసీ వినియోగదారులు ప్రత్యేక కార్డ్స్‌లో పూర్తి వివరాలు పొందుపరచాలని, దీనివల్ల టికెట్‌ను వేగంగా బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. వినియోగదారుడు పేమెంట్ ఆప్షన్లను ‘మై ప్రొఫైల్ సెక్షన్’ ద్వారా మేనేజ్ చేసుకోవడం ద్వారా కూడా వేగంగా టికెట్స్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. 10.5 లక్షల బెర్తుల కోసం రోజూ ఐఆర్‌సీటీసీ ద్వారా 13 లక్షల టికెట్లు బుక్కవ్వుతున్నాయి. 

Related Posts