YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఉత్తమ్ కు తెలియకుండానే డీసీసీలు

ఉత్తమ్ కు తెలియకుండానే డీసీసీలు
తెలంగాణ సీఎం కావాల‌ని గంపెడాశ‌లు పెట్టుకున్న టీ పీసీపీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డికి కొత్త చిక్కులు వ‌చ్చిప‌డ్డాయి. ఇటీవ‌ల తెలంగాణ‌లో ప్ర‌క‌టించిన డీసీసీల నియామ‌కాల్లో ఆయ‌న‌కు క‌నీస స‌మాచారం కూడా ఇవ్వ‌లేద‌ట‌. పైగా.. జిల్లాల వారీగా ఎవ‌రు ఎలా.. ప‌నిచేస్తార‌నే క‌నీస స‌మాచారం కూడా అడ‌గ‌లేద‌ట పాపం. దీంతో ఉత్త‌మ్‌కు త‌న ప‌ద‌వి ఉంచుతారా! ఎన్నిక‌ల‌లోపే హుష్‌కాకి చేస్తారా అనే మీమాంశంలో కొట్టుమిట్టాడుతున్నార‌ట‌. పీసీసీ ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తే.. ఎవ‌రికి ఇస్తార‌నేది మ‌రో ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఎంతో క‌ష్ట‌ప‌డి.. ఈ మ‌ధ్య‌నే బ‌స్సుయాత్ర‌తో స‌త్తా చాటాలనుకున్నాడు. పార్టీలో చ‌ర్చించ‌కుండా ప్రెస్‌మీట్లు.. కామెంట్స్ చేయ‌టంతో కొంద‌రు సీనియ‌ర్లు కావాల‌నే త‌న‌మీద క‌క్ష‌గ‌ట్టి ప్ర‌తీకారం తీర్చుకుంటున్నారంటూ.. కార్య‌క‌ర్త‌ల వ‌ద్ద ఆవేద‌న వెలిబుచ్చార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.వాస్త‌వానికి ఎప్ప‌టి నుంచో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ పీసీపీ పీఠంపై ఆశ‌ప‌డుతూ వ‌చ్చారు. వారికి.. సోనియాతోపాటు.. రాహుల్‌గాంధీతో మంచి అనుబంధం ఉంది.. హ‌స్తం పార్టీలో త‌మ‌ను కాద‌నేవారు లేర‌నే ధీమా ఉండేది. కానీ అక‌స్మాత్తుగా ప‌ద‌వి ప్ర‌త్య‌ర్థిని వ‌రించ‌టంతో అటునుంచి పార్టీప‌రంగా స‌హ‌కారం త‌గ్గుతూ వ‌చ్చింది. ఉత్త‌మ్ స‌ర్వే చేయించి ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్ బ‌లం పెరుగుతుంద‌ని బూస్ట‌ప్ ఇద్దామని భావిస్తే.. కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి మీడియా స‌మావేశం పెట్టీ మ‌రీ..ఇదంతా ఉత్తిదేనంటూ.. ఉత్త‌మ్ ప‌రువు న‌డిబ‌జార్లో పెట్టినంత ప‌నిచేశాడు. ఈ అంత‌ర్యుద్ధం పార్టీకు న‌ష్టం క‌లిగిస్తుందంటూ.. సీనియ‌ర్ నేత‌లు.. జానారెడ్డి, ల‌క్ష్మ‌య్య‌, జ‌య‌పాల్‌రెడ్డి వంటి వారు హైక‌మాండ్‌కు మోసారు. ఫ‌లితంగానే.. ఉత్త‌మ్ మాట‌ను క‌నీసం అటెండ‌ర్ కూడా విన‌ట్లేద‌నే స్థాయికి చేర్చారు.ఇటీవ‌ల డీసీసీ అధ్య‌క్షుల నియామ‌కాల విష‌యం కూడా రాహుల్ స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించార‌ట‌. తెలంగాణ‌లో ఏం జ‌రుగుతుంద‌నే త‌న‌కంటే.. రాహుల్‌గాంధీకే ఎక్కువ తెలుసంటూ.. ఇటీవ‌ల ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి చేసిన కామెంట్స్‌.. నిజంగా మాట్టాడారా! లేక‌పోతే.. ఎద్దేవా చేసేందుకా అనే పోస్టుమార్టం కూడా ప్ర‌త్య‌ర్థులు చేసేప‌నిలో ప‌డ్డారు. ఇప్పుడే ఇలా ఉంటే.. రేప‌టి ఎన్నిక‌ల వేళ‌.. ఎవ‌రికి టిక్కెట్టు ఇస్తార‌నేది కూడా.. అంద‌రిలాగానే.. మ‌రుస‌టిరోజు పేప‌ర్లో చూసుకోవాల్సిన దుస్థితి వ‌చ్చిందా అనే స్థాయికి ఉత్త‌మ్‌చేరార‌ట‌. ప‌రువు , ఆత్మాభిమానం పోగొట్టుకుంటూ.. అధికార పార్టీతో చీవాట్లు తింటూ.. ఇన్నేళ్లు న‌డిపిస్తూ వ‌స్తే.. అదిష్ఠానం త‌న‌కు భ‌లే మ‌ర్యాద చేసిందంటూ.. అయిన‌వారి వ‌ద్ద ఉత్త‌మ్ గొంతు విప్పుతున్నాడ‌ట‌.

Related Posts