YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అరసవల్లి ఆలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలు

అరసవల్లి ఆలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలు

శ్రీకాకుళం
కలియుగ ప్రత్యక్ష దైవం.. దేశం లోనే పూజలు జరిగే ఏకైక సూర్య దేవాలయం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్య దేవాలయం లో రధసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఆదిత్యుడి సూర్యజయంతి సందర్భంగా భక్తులు తండోపతండాలుగా దర్శనానికి పోటెత్తారు..సూర్యుని పుట్టిన రోజైన  రధసప్తమి నాడు అరసవల్లి సుర్యదేవునికి విశేష పూజలు జరిగాయి. ముందుగా విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి  స్వాత్మనందేంద్ర సరస్వతి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఉత్సవానికి అంకురార్పణ చేశారు. . వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి సూర్యజయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అనంతరం  పన్నెండు గంటల అయిదు నిమిషాల నుండి క్షీరాభిషేకం ప్రారంభం అయింది. పాలు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలుతో స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. ఉదయం అయిదు గంటల నుండి భక్తులకు స్వామి వారి నిజరూప దర్శనం ప్రారంభం అయింది. దేశం నలుమూలల నుండి తరలి వచ్చిన  భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ నిజరూప దర్శనం సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది. రధసప్తమి, సూర్యజయంతి సందర్భంగా స్వామి వారికి విశేష పుష్పమాల అలంకరణ సేవ, విశేష అర్చన, నీరాజనం వంటి పూజలను నిర్వహించనున్నారు. స్వామి వారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. లక్షలాది మంది భక్తులు అరసవల్లి సూర్యభగవానుడి నిజరూప దర్శనం చూసి పులకించిపోయారు.. ఏడాదికి ఒక్కసారి మాత్రమే సూర్య జయంతి నాడు ఈ మహా దర్శనం లభించనుండటంతో భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని  అధికారులు, ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు రావు,ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వామి వారిని దర్శించుకున్నారు..

Related Posts