YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నాలుగు ఎంపీల గెలుపుపైనే అందరి దృష్టి

 నాలుగు ఎంపీల గెలుపుపైనే అందరి దృష్టి
బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఫలితంగా ఉత్తరప్రదేశ్‌లోని కైరానా లోక్‌సభ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనే విషయం పై ఉత్కంఠ నెలకుంది. జరిగింది ఉప ఎన్నికనే కానీ. కర్నాటక ఎన్నికల తర్వాత విపక్షాలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడమే ఇందుకు కారణం. అందుకే అంతా వాటి ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తిని పెంచుతోంది. అధికార బీజేపీకి, ప్రతిపక్ష పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకరం ఈ ఎన్నికలు. 2014లో ఇక్కడ 80 సీట్లకుగాను 71 సీట్లను బీజేపీ గెలుచుకుంది. అప్నాదళ్‌కు మరో రెండు సీట్లు వచ్చాయి.అప్పుడు కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీ మధ్య ఓబీసీ, దళితులు, ముస్లింలు ఓటర్లు చీలిపోయారు. ఇప్పుడు అవన్నీ ఒక కూటమిగా ఏర్పడ్డాయి. యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ యోగి ఖాళీ చేసిన గోరఖ్‌పూర్, డిప్యూటి ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ఖాళీ చేసిన ఫూల్పూర్‌ లోక్‌సభ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అందుకే ఈ సారి అదే ఫార్మూలా ఉపయోగించాయి విపక్షాలు.కర్నాటకలో కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి బీజేపీకి వ్యతిరేకంగా పలు ప్రాంతీయ, జాతీయ పార్టీల నాయకులు చేతులు కలిపాయి. తమ భవిష్యత్‌ ఐక్యతను సూచించాయి. అందుకే కైరానా లోక్‌సభ ఉప ఎన్నిక పై అందరి దృష్టి పడింది. బీజేపీ సిట్టింగ్‌ సభ్యుడు ఎంపీ హుకుమ్‌ సింగ్‌ చనిపోయారు. అందుకే కైరానా లోక్‌సభకు ఉప ఎన్నిక వచ్చింది. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన తన సమీప ఎస్పీ అభ్యర్థి నహీద్‌ హాసన్‌పై 2.3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు ఎస్పీ నుంచి తబాసన్‌ హాసన్‌ ఆర్‌ఎల్‌డీ టిక్కెట్‌పై పోటీ చేయగా, బీజేపీ పార్టీ తరఫున హుకుమ్‌ సింగ్‌ కూతురు మగాంక సింగ్‌ రేసులో నిలిచారు. ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Related Posts