విజయవాడ, ఫిబ్రవరి 20
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి వైసీపీ లో ఎదురు లేదు. సీఎం జగన్ వద్ద మంచి పలుకుబడి ఉంది. కానీ ఇప్పటి వరకు ఆయనకు టిక్కెట్ ఖరారుచేయలేదు. అలాగని వేరే అభ్యర్థి పేరు బయటకు రాలేదు. కానీ ఇప్పుడు కొత్తగా వేరే అభ్యర్థి పేరు వినపిస్తోంది. మండలి హనుమంతరావు అనే నేతకు గుడివాడ టిక్కెట్ ఇవ్వబోతన్నారన్న ప్రచారం జరుగుతోంది. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ ప్రధాన కూడళ్లలో బ్యానర్లు వెలిశాయి. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావుకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చిందంటు ఫోన్లలో వైసీపీ నేతల గుసగుసలాడుకుంటున్నారు. హనుమంతరావుకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దివంగత వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడుగా హనుమంతరావుకు గుర్తింపు ఉంది. పట్టణంలో ఏర్పాటైన బ్యానర్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గుడివాడ వైసీపీలో గందరగోళం నెలకొనడంతో అధికార పార్టీ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు సంచలనంగా మారడంతో మండలి హనుమంతరావు పేరుతో ఉన్న ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. గుడివాడ ప్రధాన కూడలిలో ఫ్లెక్సీలు వెలిసిన గంటలోపే వాటిని తొలగించారు. కొడాలి నాని ఆదేశాలతోనే ఫ్లెక్సీలు తొలగించారని మండల హనుమంతరావు వర్గీయులు ఆరోపిస్తున్నారువ్యతిరేకత ఉన్న అభ్యర్థుల్ని పూర్తి స్థాయిలో మారుస్తానని తనకు ఎంత దగ్గర అయినప్పటికీ .. పార్టీని ఓడగొట్టుకోలేనని గడప గడపకూ కార్యక్రమం సమీక్షల సందర్భంగా సీఎం జగన్ చాలా సార్లు చెప్పారు. కొడాలి నాని.. గడప గడపకూ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోలేదని పార్టీ మీటింగ్‌లో చాలా సార్లు ై ప్యాక్ ప్రతిిధులు చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. అయితే కొడాలి నాని మాత్రం.. తనదైన శైలిలో రాజకీయాలు చేసుకుంటున్నారు. ఆయనకు ధీటైన నేత గుడివాడ వైసీపీలో లేరు. కొడాలి నాని వైసీపీలో చేరిన తర్వాత అందరూ సైలెంట్ అయిపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యర్థులపై తిట్ల దండకంతో విరుచుకుపడటంతో గుడివాడ కొడాలి నాని ముందున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, నారా లోకేష్‌లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే నాని ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే సందేహం వైసీపీ వర్గాల్లో కూడా ఉంది.సర్వేలు, నివేదికలు ఆధారంగా గుడివాడలో కూడా అభ్యర్థి మార్పు ఉంటుందని పార్టీ వర్గాల్లో కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో గుడివాడలో కొత్త అభ్యర్థి పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ ప్రధాన కూడళ్లలో బ్యానర్లు వెలిశాయి.వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావుసీఎం నుండి పిలుపు వచ్చిందని ఫోన్లలో వైసీపీ నేతలు మధ్య ప్రచారం జరుగుతోంది. హనుమంతరావుకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్ కుటుంబానికి విధేయుడిగా హనుమంతరావుకు గుర్తింపు లభించిందని ఆయన వర్గం చెబుతోంది.మరోవైపు గుడివాడలో ఏర్పాటైన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. కొడాలి నాని స్థానంలో హనుమంతరావుకు టికెట్ ఇస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్నా నాని వర్గం స్పందించలేదు.దీంతో గుడివాడ వైసీపీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో గుడివాడ వైసీపీ టికెట్ కొడాలి నానికి కాకుండా మండవ హనుమంతరావుకు ఇస్తున్నారనే ప్రచారం అక్కడ జరుగుతోంది.ఇప్పుడు సీఎం జగన్ నిజంగా అభ్యర్థిని మార్చే పరిస్థితి లేదని వైసీపీ వర్గాలనుకుంటున్నాయి. అయితే గుడివాడలో సర్వే రిపోర్టులు చూసి .. కాపు సామాజికవర్గ అభ్యర్థికి టిక్కెట్ ఇస్తే బాగుంటుందన్న ఆలోచన జగన్ చేయవచ్చని చెబుతున్నారు. మరో కీలక నియోజకవర్గానికి కొడాలి నానిని పంవవచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తంగా మండలి హనుంతరావు గుడివాడ వైసీపీలో కలకలం రేపుతున్నారు.