YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

భక్తులతో రద్దీగా మేడారం

భక్తులతో రద్దీగా  మేడారం

వరంగల్, ఫిబ్రవరి 20 
ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన ఈ సమ్మక్క–సారలమ్మ  జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో రాష్ట్రం ప్రభుత్వం రూ.105 కోట్లు సాంక్షన్ చేసి, వివిధ పనులు చేపడుతుండగా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా రూ.3 కోట్లు కేటాయించింది. దీంతో ఓ వైపు పనులు చేస్తూనే మరో వైపు జాతర నిర్వహణకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.మేడారం మహాజాతరకు ముందస్తు మొక్కులు సమర్పించే భక్తుల తాకిడి ఎక్కువైంది. సాధారణ రోజుల్లోనే నిత్యం వేలాది మంది మొక్కులు సమర్పిస్తుండగా.
ఇక సెలవు దినాల్లో జాతరకు తరలివస్తున్న వారిసంఖ్య నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటోంది. వారాంతపు సెలవుల్లో కుటుంబ సభ్యులు, పిల్లాపాపలతో తరలివచ్చి అమ్మవార్ల గద్దెలను దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో అక్కడి ప్రాంగణమంతా ఇసుకేస్తే రాలని చందంగా తయారవుతోంది.మేడారంలో ముందస్తు మొక్కులు పెట్టే భక్తుల సంఖ్య పెరిగిపోతుండటంతో టీఎస్ ఆర్టీసీ కూడా జాతరకు కొద్దిరోజుల ముందు నుంచే హనుమకొండ బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు కూడా నడిపిస్తోంది. దీంతో వనదేవతల దర్శనానికి వచ్చే జనాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది.ఆదివారం మేడారంలో ఫుల్ రష్ కనిపించింది. తెల్లవారుజాము నుంచే మేడారం జాతరలో భక్తులు దర్శనానికి క్యూ కట్టగా.. ఈ ఒక్కరోజే సుమారు ఐదు లక్షల మంది వరకు భక్తులు మొక్కులు సమర్పించి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలా ప్రతి ఆదివారం, ఇతర సెలవు దినాల్లో కలిపి ఇప్పటికే ఏంతక్కువ 20 లక్షల మందికిపైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు.మేడారం మహాజాతర నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ  ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జాతరకు జనాలను తరలించడంలో ఆర్టీసీదే కీలక పాత్ర కాగా.. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 51 ఆపరేటింగ్ పాయింట్ల నుంచి ఆరు వేలకు పైగా బస్సులు నడిపిస్తోంది.ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే దాదాపు సగం బస్సులు నడుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో వరంగల్ ట్రై సిటీ కీలకం కాగా.. వరంగల్, హనుమకొండ, కాజీపేట పరిధిలో ఏర్పాటు చేసిన మూడు ఆపరేటింగ్ పాయింట్ల ద్వారా దాదాపు వెయ్యి బస్సులకుపైగా నడిపించే అవకాశం ఉంది.కేవలం ఈ మూడు పాయింట్ల నంచే సుమారు పది లక్షల మందిని తరలించే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం ఉదయం నుంచి మేడారం స్పెషల్ బస్సులను ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు. ఇప్పటికే ప్రతి బుధ, ఆదివారాల్లో హనుమకొండ బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తుండగా.. మేడారంలో ఆర్టీసీ సౌకర్యార్థం 55 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేశారు.మొత్తం 15 కిలోమీటర్ల పొడవు ఉండే 48 క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈసారి మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా సుమారు 30 లక్షల మందైనా ఆర్టీసీ సేవలను వినియోగించుకునే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు.  

Related Posts